అనారోగ్యం బారిన పడినప్పుడు రకరకాల పరీక్షలు చేస్తుంటారు. మనకున్న సమస్యను తెలుసుకోవాలంటే పరీక్షలు తప్పనిసరి. ఇక అనేక తీవ్రమైన వ్యాధులలో వైద్యులు సమగ్ర సమాచారం కోసం CT స్కాన్ చేయమని సిఫార్సు చేస్తారు. సిటీ స్కాన్ అనే పేరు చాలా మందికి వినిపిస్తుంటుంది. అయితే ఇంతకుముందు ఎక్స్-రేలు చేసిన వైద్యులు ఇప్పుడు సీటీ స్కాన్ కోసం పంపుతుంటారు. కొంతమందికి ఎక్స్-రే, సిటీ స్కాన్‌ను అడుగుతుంటారు. అంటే పరిస్థితి తీవ్రంగా ఉందని భావించి ఈ స్కాన్‌ను తీయాలని సిఫార్స్ చేస్తుంటారు. మరి ఈ సిటీ స్కాన్ ఎందుకు తీస్తారో తెలుసుకుందాం.
సిటీ స్కాన్ అనేది X- రే యొక్క ఒక రూపం. దీనిని సీఏటీ (CAT) స్కాన్ అని కూడా అంటారు. అయితే దీని పూర్తి పేరు కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ (CT స్కాన్). సిటీ స్కాన్ సాధారణంగా ఉన్న రోగులకు తీయరు. వైద్యులు మొదట ఎక్స్-రేలు మాత్రమే అడుగుతారు. కానీ ఎక్స్‌రే ద్వారా కాకుండా మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ సిటీ
స్కాన్‌ను రాస్తుంటారు వైద్యులు.
ఒక వ్యాధి గురించి పరీక్షించేటప్పుడు, దాని గురించి సవివరమైన సమాచారాన్ని సేకరించేటప్పుడు వైద్యులు శరీరంలోని మృదు కణజాలాలు, రక్త నాళాలు లేదా ఎముకల గురించి వివరణాత్మక అధ్యయనం అవసరమైనప్పుడు సిటీ స్కాన్ అవసరమవుతుంది. అందుకే పెద్ద జబ్బుల్లో మాత్రమే వైద్యులు సిటీ స్కాన్ చేస్తుంటారు. అలాగే ఏదైనా పెద్ద సమస్యను క్లియర్ చేయడానికి ఈ స్కాన్ చేస్తుంటారు. ఎందుకంటే సిటీ స్కాన్ శరీరానికి సంబంధించిఅంతర్గత భాగాల చిత్రాలను వివరంగా తెలియజేస్తుంటుంది.
☛ మెదడులో ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు
☛ భుజంలో ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉంటే
☛ గుండె సమస్యలు
☛ మోకాలి సమస్యలు
☛ ఛాతీ భాగంలో సమస్యలు
☛ ఉదర సిటీ స్కాన్
☛ వెన్నుముకకు సంబంధించిన సమస్యలకు
☛ కండరాల సమస్యలో
☛ తీవ్రమైన ఎముక వ్యాధులలో
☛ క్యాన్సర్ చికిత్స సమయంలో
☛ శరీరంలో ఏదైనా అంతర్గత గాయానికి చికిత్స చేయడానికి
☛ గుండె సమస్యలు లేదా వ్యాధుల చికిత్సలో..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..