Cholesterol Diet: శీతాకాలంలో ఈ నాలుగు చిట్కాలతో అధిక కొవ్వు సమస్య దూరం..అవేంటో తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి

| Edited By: Anil kumar poka

Dec 16, 2022 | 12:09 PM

మంచి ఆహారం, వ్యాయామం, అప్పుడప్పుడు ఔషధాలు తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి గట్టెక్కవచ్చని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే గుండె జబ్బుల ప్రమాదం నుంచి కూడా బయటపడవచ్చని సూచిస్తున్నారు.

Cholesterol Diet: శీతాకాలంలో ఈ నాలుగు చిట్కాలతో అధిక కొవ్వు సమస్య దూరం..అవేంటో తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి
Fruits
Follow us on

సాధారణంగా శీతాకాలంలో అధిక బరువు సమస్యతో బాధపడుతుంటాం. వ్యాయామం చేసే సమయం తగ్గడం, అలాగే అధిక నిద్ర కారణంగా శరీరంలో అనవసర కొవ్వు పేరుకుపోతుంది. మన శరీరం కూడా అధిక క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవాలని ప్రేరేపిస్తుంది. దీంతో మనం ఎక్కువుగా వాటినే తీసుకుంటారు. శీతాకాలం వాతావరణం కారణంగా సాయంత్రం సమయంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించడంతో ఎక్కువుగా ఫాస్ట్ ఫుడ్స్ పై ఆధారపడతాం. ఇలా చాలా వరకూ మన అలవాట్ల కారణంగానే శరీరం అధిక కొలెస్ట్రాల్ స్టాక్ చేసుకునేందుకు మనం వీలు కల్పించడానికి అవకాశం ఇస్తాం. మంచి ఆహారం, వ్యాయామం, అప్పుడప్పుడు ఔషధాలు తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ సమస్య నుంచి గట్టెక్కవచ్చని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే గుండె జబ్బుల ప్రమాదం నుంచి కూడా బయటపడవచ్చని సూచిస్తున్నారు. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఆహార అలవాట్లలో చిన్న చిన్న మార్పుల ద్వారా అధికంగా లాభం పొందవచ్చు. 

చెడు కొలెస్ట్రాల్ తక్కువుగా ఉంచడానికి సహాయపడే ఆహారాలివే…

  1. మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇవ ఆవ నూనె, ఆలివ్ ఆయిల్, టిల్ ఆయిల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శీతాకాలంలో వీటితో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
  2.  రోజు కనీసం 4- 5 సార్లు కూరగాయలు లేదా పండ్లను తింటే మంచిదని పోషకాహారం నిపుణుల అభిప్రాయం
  3.  శీతాకాలంలో అధిక ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఆకు కూరలు, ఓట్స్ , పప్పు దినుసులతో చేసి ఆహారం తినడం ఉత్తమం.
  4.  ఈ సమయంలో శరీరానికి అధికంగా విటమిన్ ఈ అవసరం కాబట్టి విటమిన్ ఈ సప్లిమెంట్స్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం