ఆరోగ్య చిట్కాలు.. రాత్రిపూట అస్సలు తినకూడని ఆహారాలు ఇవి.. దూరం పెడితే మంచిది..!

|

Oct 17, 2022 | 9:08 PM

ఎందుకంటే ఇది శ్లేష్మాన్ని ఉత్పత్రి చేసి కఫానికి దారి తీస్తుంది. సాధారణంగా ఆరోగ్యానికి చాలా మేలు చేసే కూరగాయ కాలీఫ్లవర్‌.. కానీ, బ్రకోలీలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా

ఆరోగ్య చిట్కాలు.. రాత్రిపూట అస్సలు తినకూడని ఆహారాలు ఇవి.. దూరం పెడితే మంచిది..!
అల్లం నీరు: అల్లంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి పని చేస్తాయి. అల్లం తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య దూరం అవుతుంది. అల్లం నీళ్లలో వేసి మరిగించి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
Follow us on

మనం పగలు తినే ఆహారాలన్నీ రాత్రిపూట తినవచ్చా? అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతుంది. అలా తినేవారూ ఉన్నారు. మీరు పగలు తినే ఆహారం అంతా రాత్రిపూట తినకూడదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే, చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. రాత్రి సమయంలో మనం తీసుకునే భోజనం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. అయితే రాత్రి భోజనంలో తినకూడని కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. రాత్రి సమయంలో పలు రకాల ఆహారపదార్థాలను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వాటిలో పెరుగును రాత్రి పూట తినడానికి సరైన ఆహారం కాదంటున్నారు..ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట పెరుగు తినకూడదు. ఎందుకంటే ఇది శ్లేష్మాన్ని ఉత్పత్రి చేసి కఫానికి దారి తీస్తుంది. సాధారణంగా ఆరోగ్యానికి చాలా మేలు చేసే కూరగాయ కాలీఫ్లవర్‌.. కానీ రాత్రిపూట గాఢ నిద్రకు ఆటంకాలు కలిగిస్తుందట.. ప్రశాంతమైన నిద్ర కోసం రాత్రి భోజనంలో కాలీఫ్లవర్‌ను తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి భోజనంలో సలాడ్‌తో టొమాటోలను ఎప్పుడూ తినకూడదు. ఈ సూపర్ ఫుడ్ రాత్రి నిద్రపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు.

రాత్రిపూట సరిగ్గా జీర్ణం కాకపోవడం లేదా ఉదయం ఎసిడిటీకి కారణమవుతుంది. బ్రోకలీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చాలా మందికి తెలిసిందే. అయితే డిన్నర్‌లో బ్రకోలీని ఎప్పుడూ తినకూడదు. బ్రకోలీలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. అలాగే రాత్రి పూట ఎలాంటి సమస్య లేకపోయినా ఉదయం నిద్ర లేవగానే గ్యాస్, ఎసిడిటీ సమస్య రావచ్చు.రాజ్మాలో ఐరన్, కాపర్, ఫోలేట్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ సీ వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, రాజ్మాను రాత్రి సమయంలో తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మందగిస్తుంది. అంతే కాకుండా కడుపులో గ్యాస్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఈ ఆహార పదార్థాలను మాత్రం రాత్రి అస్సలు తినకండి.

ఇవి కూడా చదవండి

దొరికినప్పుడల్లా టీ, కాఫీలు తాగేవాళ్లు కొందరు. అయితే రాత్రి పూట వీటిని తాగకూడదు. ఎందుకంటే అలాంటి కెఫిన్ పానీయాలు తాగడం వల్ల మీ నిద్రపై ప్రభావం పడుతుంది. మరియు ఈస్ట్ మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.