Foods Act As Viagra
ఇటీవల చాలామంది పురుషులు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు. మరికొందరికి లైంగిక సమస్యలు వేధిస్తుంటాయి. ఇక వీటిని అధిగమించేందుకు చాలామంది మార్కెట్‌లో లభ్యమయ్యే ఔషధాలు, వయాగ్రా ట్యాబ్లెట్ల లాంటివి వాడుతుంటారు. అయితే వీటి వల్ల ప్రయోజనాల కంటే సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మార్కెట్‌లో లభించే ఔషధాలు, ట్యాబ్లెట్ల కంటే.. సరైన పౌష్టికాహారం ద్వారా ఇలాంటి సమస్యలను దూరం చేయవచ్చునని డాక్టర్ల సలహా. ఈ ఆహారాలను సమస్యను సులభంగా పరిష్కరిస్తాయని అంటున్నారు. వయాగ్రా మాదిరిగా పని చేసే ఆ 10 ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ 10 ఫుడ్స్ ఏంటంటే..
- దానిమ్మ: దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ గింజలను తినడమేనా.. లేదా జ్యూస్ తాగినా మీకు కావల్సినంత ఎనర్జీ వస్తుంది. దానిమ్మ సహజసిద్ధమైనది కాబట్టి.. ఇది తీసుకున్నా మీకు ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.
- పుచ్చకాయ: కొన్ని అధ్యయనాల ప్రకారం.. పుచ్చకాయ వయాగ్రాలా పని చేస్తుందట. ఇది మీ రక్తనాళాలను అదుపులో ఉంచడమే కాకుండా అర్జినైన్ అనే కాంపౌండ్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే నైట్రిక్ ఆక్సైడ్‌ను క్రియేట్ చేస్తుంది. ఇక ఈ నైట్రిక్ ఆక్సైడ్ మీ లైంగిక జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంగస్తంభన సమస్యను అధిగమించేలా చేస్తుంది.
- ఆకుపచ్చ కూరగాయలు: బచ్చలికూర, క్యాబేజీ, ఇతర ఆకుకూరలు ఏవైనా కూడా వయాగ్రాకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే విటమిన్- ఈ మీలో ఎనర్జీని పెంపొందించడమే కాకుండా.. సంతృప్తి పరిచేందుకు పలు హార్మోన్లను విడుదల చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
- గుమ్మడి గింజలు: లైంగిక సమస్యలను దూరం చేసేందుకు గుమ్మడి గింజలు తినమని చాలామంది వైద్యులు తరచూ సిఫార్సు చేస్తుంటారు. వీటిల్లో జింక్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తింటే సంతానోత్పత్తి సామర్ధ్యం పెరగడమే కాదు.. ఆరోగ్యపరంగా అనేక లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ మీ మానసిక స్థితిని మెరుగుపరచడమే కాదు.. మీలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. డార్క్ చాక్లెట్‌లో సెరోటోనిన్, ఫెనెథైలమైన్ అనే మాలిక్యుల్స్ ఉన్నాయి. ఇది మీ లిబిడో(Libido)ను పెంచుతుంది.
- స్ట్రాబెర్రీలు: స్ట్రాబెర్రీలలో విటమిన్ – సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది.
- అరటిపండు: అరటిపండులో రక్త ప్రసరణను పెంచే పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పండులోని విటమిన్ – బి మీ ఎనర్జీని పెంపొందిస్తుంది. అలాగే ఈ పండు టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలను కూడా పెంచుతుంది.
- ఇవే కాకుండా, నట్స్, డ్రై ఫ్రూట్స్, మిరప, అవకాడోలు కూడా వయాగ్రాకు ప్రత్యామ్నాయంగా పని చేస్తాయి. ఇలాంటి పోషకాహారాలు తీసుకుంటే.. మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే వీటిని కూడా మోతాదులోనే తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
గమనిక: ఈ ఆర్టికల్ పలు అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం ద్వారా కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయబడింది. ఏదైనా డైట్‌ను ఫాలో చేసే ముందు కచ్చితంగా డాక్టర్ల సలహా తీసుకోండి.