
Baby Care Tips In Summer: ఎండలు పెరిగిపోతున్నాయి. పగలు ఇళ్లలో (Child Care) నుంచి బయటకు రావడానికి ప్రజలు భయపడిపోతున్నారు. మరోవైపు.. బయటకు వెళ్లేముందు కనీస జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే ఇంట్లో ఉన్నప్పటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతల వలన చర్మ సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. దద్దర్లు, దురద వంటి సమస్యలు చిన్న పిల్లల సున్నిత చర్మంపై ఎక్కువగా ఇబ్బందిపెడుతుంటాయి. వేసవిలో వారిని జాగ్రత్తగా చూసుకోకపోతే దద్దుర్లు, మొటిమలు వస్తాయి. అందుకే వేసవిలో పిల్లల చర్మం పట్ల కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. మై హెల్త్ లో ప్రచురించబడిన ఓ నివేదిక ప్రకారం.. తల్లిదండ్రులు తమ పసి పిల్లలకు స్నానం చేయించడానికి కాస్త ఆలోచిస్తారు. కానీ వేసవిలో మీ పిల్లలకు ప్రతిరోజూ స్నానం చేయించాలి. దీంతో వారు ఉత్సాహంగా ఉంటారు. వారికి రిఫ్రెష్ కలుగుతుంది. అంతేకాకుండా.. వారికి చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్ సమస్య ఉండదు.
మీ పిల్లలకు వేడి నీటిలో స్నానం చేయిస్తే..
* ముందుగా నీటి ఉష్ణోగ్రతను చెక్ చేయాలి. మరీ వేడిగానీ, చల్లగానీ కాదు. సాధారణ నీటిలో స్నానం చేయించాలి.
* ప్రతిరోజూ షాంపూ లేదా సబ్బును అప్లై చేయకపోయినా సాధారణ నీటితో స్నానం చేయించడం వల్ల శిశువు చర్మం పై ఉండే చెమట, ధూళి తొలగిపోతాయి.
* పొడి చర్మం ఉండే పిల్లలకు ఎక్కువగా రుద్దడం చేయకూడదు. సున్నితంగా రుద్దాలి.
* స్నానం చేయించగానే.. పిల్లలకు బేబీ క్రీమ్, లోషన్ అప్లై చేయాలి.
దుస్తుల విషయంలో జాగ్రత్తలు..
పిల్లలకు వదులుగా ఉండే దుస్తులు వేయకూడదు. శిశువు చర్మం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి వీలుగా ఉండాలి. బిగుతుగా ఉండే దుస్తులు వేయడం వలన పిల్లల చర్మం కందిపోవడం.. ఎర్రగా మారడం జరుగుతుంది. వారికి వేసవిలో కాటన్ దుస్తులు మాత్రమే వేయాలి.
పిల్లల చర్మం పట్ల జాగ్రత్తలు..
పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. త్వరగా పొడిబారుతుంది. మాయిశ్చరైజ్ సరిగా లేకపోతే చర్మంలోని తేమ పోతుంది. ఈ సమయంలో మాయిశ్చరైజర్ చేయాలి. వడదెబ్బ నుండి రక్షిస్తుంది. బయటకు వెళ్లినప్పుడు పిల్లలకు పూర్తిగా దుస్తులు వేయాలి. టోపీ పెట్టుకోవడమే కాకుండా.. ఒక గొడుగు కూడా తీసుకెళ్లాలి. వేడి దద్దుర్లు నుండి దూరంగా ఉండటానికి ఇ బేబీ సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి.
మధ్యాహ్నం పిల్లలను బయటకు తీసుకురావద్దు..
మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయి. ఈ సమయంలో పిల్లలను బయటకు తీసుకురావద్దు. ఎందుకంటే ఈ సమయంలో బయటకు తీసుకురావడం వలన హీట్ స్ట్రోక్, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఏసీలో పిల్లలను ఎక్కువ సమయం ఉంచకూడదు. ఇలా చేయడం వలన వారి చర్మం చిన్నపాటి వేడిని కూడా తట్టుకోలేదు. అలాగే ఎక్కువ సమయంల ఏసిలో ఉండడం వలన చర్మం పొడిబారుతుంది.
పిల్లలు హైడ్రేటెడ్ గా ఉండేలా చేయాలి. పిల్లలకు చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు వారికి మధ్య మధ్యలో మూడు నుంచి నాలుగు చెంచాల నీళ్లు తాగించాలి. పిల్లలకు బాగా హైడ్రేషన్ ఉంటే చెమట పట్టదని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. ఆర్ద్రీకరణను నిర్వహించడానికి ఆరు నెలల తర్వాత నీరు మరియు రసాలను త్రాగటం అవసరం.
గమనిక:- ఈ కథనం కేవలం నిపుణులు అభిప్రాయాలు, సూచనలు.. ఇతర నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించండి. అమలు చేయడానికి ముందు వైద్యులను సంప్రదించాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
KGF 2 Yash: కేజీఎఫ్ 3 గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాఖీభాయ్.. సెకండ్ పార్ట్‌కు మించి ఉంటుందని..