Corona Tips: కరోనా భయం వెంటాడుతోందా.? ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే బిందాస్‌గా ఉండొచ్చు.

|

Dec 26, 2022 | 11:15 AM

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి మానవాళిని భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న కేసులు, మరీ ముఖ్యంగా చైనాలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం ప్రజలను భయానికి గురి చేస్తోంది. విదేశాల్లో నమోదవుతోన్న కేసులు..

Corona Tips: కరోనా భయం వెంటాడుతోందా.? ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే బిందాస్‌గా ఉండొచ్చు.
Home Tips For Immunity Power
Follow us on

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి మానవాళిని భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న కేసులు, మరీ ముఖ్యంగా చైనాలో కరోనా సృష్టిస్తున్న కల్లోలం ప్రజలను భయానికి గురి చేస్తోంది. విదేశాల్లో నమోదవుతోన్న కేసులు మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తున్నాయి. దీంతో ప్రజలు మళ్లీ ఆరోగ్యంపై దృష్టిసారిస్తున్నారు. అయితే కరోనా విషయంలో భయం కంటే అప్రమత్తంగా ఉండడమే మంచిదనే విషయం తెలిసిందే. వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ మాస్క్‌లు ధరిస్తే కరోనాకు చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతూనే ఉన్నారు. కరోనా నిబంధనలతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవడం ద్వారా కరోనాను తరమికొట్టొచ్చు. వంటిట్లో లభించే వస్తువులతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటంటే..

* రోగ నిరోధక శక్తి పెంచుకోవడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. తీసుకునే వంటకాల్లో పసుపును పెంచడంతో పాటు ప్రతీరోజూ పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

* రోగ నిరోధశక్తిని పెంచడంలో పచ్చి ఏలకులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఏలకులను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల తీవ్రమైన వ్యాధులను సైతం తరిమికొట్టొచ్చు.

ఇవి కూడా చదవండి

* లవంగాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో రోగ నిధోదక శక్తిని పెంచుతుంది.

* జాజికాయలోని ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

* నల్ల మిరియాలు కూడా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. నల్ల మిరియాలను టీలో కలుపుకొని తాగడం, లేదా కషాయం రూపంలో తాగడం వల్ల శరీరానికి మంచి జరుగుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు తీసుకోవడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..