Health Tips: ప్రస్తుత కాలంలో ఏది తినాలన్నా ఆహారానికి పెను ముప్పుగానే మారింది. సమయ పాలన లేని ఆహారపు అలవాట్లు, తినకూడని పదార్థాలను తినడం వల్ల అనేక మందిలో డయాబెటీస్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు సర్వసాధారణంగా ఉన్నాయి. డయాబెటీస్ కంటే ఫ్యాటీ లివర్ సమస్యతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మానవ శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో కాలేయం పని చేస్తుంది. ఈ క్రమంలో ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ పడుతున్నవారు, లేదా ఈ సమస్యకు దూరంగా ఉండాలన్నా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. మరి ఫ్యాటీ లివర్ నివారణ కోసం, నిరోధన కోసం ఏయే ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
వెల్లుల్లి: ఫ్యాటీ లివర్‌పై చేసిన ఆనేక పరిశోధనల ప్రకారం ఈ సమస్యతో బాధపడుతున్న వారు సమస్య నుంచి బయట పడడానికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలో కొవ్వును తగ్గించగల శక్తితో పాటు ఆరోగ్యాన్ని కాపాడగల అనేక పోషకాలు ఉన్నాయి.
గ్రీన్ టీ: యాంటీ ఆక్సిడెంట్లను సమృద్ధిగా కలిగిన గ్రీన్ టీ ఫ్యాటీ లివర్‌కి చెక్ పెట్టడంలో మెరుగ్గా పని చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు కణాలను రిపేర్ చేయడంతో పాటు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇంకా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్‌ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
అవకాడో: ఫ్యాటీ లివర్‌తో బాధ పడుతున్నవారికి అవకాడో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అవకాడోలోని పోషకాలు ఫ్యాటీ లివర్‌ని తగ్గించి కాలేయాన్ని సురక్షితంగా ఉంచడంతో పాటు బరువు తగ్గేవారికి ఉపకరిస్తుంది.
ప్రాసెస్డ్ ఫుడ్: ఫ్యాటీ లివర్‌తో బాధ పడుతున్నవారు పాస్తా, ఫ్రైడ్ రైస్, వైట్ బ్రెడ్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.
షుగర్ ఫుడ్స్: షుగర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. చక్కెర పెరిగినప్పుడు కాలేయంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా ఫ్యాటీ లివర్ సమస్య మరితం తీవ్రతరం అవుతుంది. ఈ కారణంగా చాక్లెట్, లడ్డూ, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ వంటి షుగర్ ఎక్కువగా ఉంటే పదార్థాలను తీసుకోకుండా ఉండడమే మంచిది.
గమనిక: పై ఆర్టికల్‌లో తెలియజేసిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి కోసం ఇచ్చినది మాత్రమే. ఏమైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి