Health Tips: ఎక్కువగా కాలం జీవించే వారు ఉదయాన్నే ఏం చేస్తారో మీకు తెలుసా?

|

Sep 22, 2023 | 12:50 PM

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో మనిషి జీవిత కాలం తగ్గిపోతుంది. జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా రోగాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి. ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యంపై అంతాగా ఫోకస్ పెట్టడం లేదు. ఈ క్రమంలో శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువ అయిపోతుంది. దీంతో రోగాలతో పోరాడలేకపోతున్నారు. ఫలితం దీర్ఘకాలి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆ తర్వాత ప్రాణాలతో పోరాడాల్సి వస్తుంది. ఎంత బిజీ లైఫ్ ఉన్నా.. కాస్త సమయం మనం తీసుకునే ఆహారం విషయంలో, వ్యాయామానికి కేటాయిస్తే.. బాడీ బలంగా ఉంటుంది. తాజాగా ప్రపంచంలో..

Health Tips: ఎక్కువగా కాలం జీవించే వారు ఉదయాన్నే ఏం చేస్తారో మీకు తెలుసా?
Healthy Food
Follow us on

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో మనిషి జీవిత కాలం తగ్గిపోతుంది. జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా రోగాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి. ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ కారణంగా ఆరోగ్యంపై అంతాగా ఫోకస్ పెట్టడం లేదు. ఈ క్రమంలో శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువ అయిపోతుంది. దీంతో రోగాలతో పోరాడలేకపోతున్నారు. ఫలితం దీర్ఘకాలి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఆ తర్వాత ప్రాణాలతో పోరాడాల్సి వస్తుంది. ఎంత బిజీ లైఫ్ ఉన్నా.. కాస్త సమయం మనం తీసుకునే ఆహారం విషయంలో, వ్యాయామానికి కేటాయిస్తే.. బాడీ బలంగా ఉంటుంది. తాజాగా ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించే వారు పాటించే నియమాలపై పలు అధ్యయనాలు చేశారు శాస్ర్తవేత్తలు. ఈ అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. అవేంటో తెలుసుకుని మీరూ పాటిస్తే.. ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జీవిత కాలం కూడా పెరుగుతుంది.

వ్యాయామం:

ఉదయాన్నే కనీసం ఒక ఐదు లేదా పది నిమిషాలైన మీకు నచ్చిన, వచ్చిన వ్యాయమాలు చేయవచ్చు. లేదా ఆ పది నిమిషాలు వాకింగ్ చేయడానికైనా ప్రాధాన్యత ఇవ్వండి. ఉదయాన్నే వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని కండరాలు బిగుతు పోకుండా సాగుతాయి. ఎక్సర్ సైజ్ చేయడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలుసు.

ఇవి కూడా చదవండి

పౌష్టికాహారమైన బ్రేక్ ఫాస్ట్:

ఉదయాన్నే న్యూట్రిషియన్స కలిగిన బ్రేక్ ఫాస్ట్ చేయడం ఉత్తమం. కొంత మంది ఉదయాన్నే టిఫిన్ ని స్కిప్ చేస్తూంటారు. మరికొంత మంది హడావిడిగా ఏదో తినేస్తారు. ఇలా కాకుండా.. మీరు తినే బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, పలు పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ ఉండాలంటే మీ మార్నిగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, సోయా మిల్క్ ని చేర్చుకోవడం ఉత్తమం.

ఉదయాన్నే ఒక కాఫీ లేదా టీని తాగవచ్చు:

కొంత మందికి కాఫీ లేదా టీ తాగనిదే పని మొదలవ్వదు. అలాంటి వారు కాఫీ లేదా టీ తాగవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు. ఉదయాన్నే కాఫీ లేదా టీ తాగడం వల్ల మీ మూడ్ మారుతుంది. మీరు ఉత్సాహంగా ఉంటారు. అయితే మీ కాఫీ లేదా టీలలో చక్కెరకు బదులుగా స్టేవియా మొక్కల పౌడర్ ను కలుపుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి చెడు ప్రభావం ఉండదు.

ప్రశాంతంగా మాట్లాడండి:

బిజీ లైఫ్ కారణంగా ఇంట్లో పనులు త్వరగా అవ్వవు. మరో వైపు ఆఫీసుకు టైం అవుతుంది. ఇలాంటి సమయంలో ఎవరికైనా చిరాకు అనేది కామన్ గా వస్తుంది. దీంతో మన చిరాకును ఇతర వ్యక్తుల మీద చూపిస్తాం. అలా కాకుండా వీలైనంత వరకూ ఇతర వ్యక్తులతో ప్రశాంతంగా మాట్లాడాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.