Uric Acid: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. ఈ రోజు నుంచే ఈ ఐదు ఆహారాలను అస్సలు తినకండి..

|

Sep 23, 2022 | 2:58 PM

Uric Acid Control Tips: మీరు యూరిక్ యాసిడ్‌ను యంత్రించాలనుకుంటే, ప్యూరిన్‌ కలిగిన ఆహారం తీసుకోవడం తగ్గించండి.

Uric Acid: కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.. ఈ రోజు నుంచే ఈ ఐదు ఆహారాలను అస్సలు తినకండి..
Uric Acid
Follow us on

యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్-కలిగిన పదార్థాల జీర్ణక్రియ నుంచి విడుదలయ్యే టాక్సిన్. ప్యూరిన్లు అనేక ఆహారాలలో సహజంగా కనిపిస్తాయి. రెడ్ మీట్, వైన్, బ్రోకలీ, ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు, లీక్స్, సోయాబీన్స్, గొడ్డు మాంసంలో ప్యూరిన్లు పుష్కలంగా ఉంటుంది. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. ప్యూరిన్స్ విచ్ఛిన్నం కావడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. యూరిక్ యాసిడ్ ప్రతి ఒక్కరి శరీరంలో ఏర్పడుతుంది. ఇది మూత్రపిండాల ద్వారా సులభంగా ఫిల్టర్ చేయబడుతుంది. శరీరం నుంచి దానిని తొలగిస్తుంది. యూరిక్ యాసిడ్ శరీరం నుంచి తొలగించబడనప్పుడు, అది కీళ్లలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.

యూరిక్ యాసిడ్ పెరుగుదల కారణంగా చేతులు, కాళ్ళ కీళ్ళలో నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. దీని పెరుగుదల బొటనవేలులో నొప్పి, వాపుకు కారణమవుతుంది. మీరు యూరిక్ యాసిడ్ పెరుగుదలతో కూడా ఇబ్బంది పడుతుంటే.. దానిని నియంత్రించడానికి కొన్ని ప్రభావవంతంగా ఉండే కొన్నింటి తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడానికి మనం అనుసరించగల సమర్థవంతమైన చర్యలు ఏమిటో తెలుసుకుందాం.

ప్యూరిన్లు ఉన్న ఆహారాన్ని నివారించండి:

యూరిక్ యాసిడ్ పెరిగితే, ఆహారంలో రెడ్ మీట్, మటన్ కిడ్నీ, చేపలు, పౌల్ట్రీ, చిక్కుళ్ళు వంటి వాటికి అస్సలు తినకండి. ఆహారాన్ని నియంత్రించడం ద్వారా మీరు యూరిక్ యాసిడ్‌ను వేగంగా నియంత్రించవచ్చు.. 2020లో జరిగిన అనేక పరిశోధనల్లో కూడా ఇదే తేలింది. ప్యూరిన్‌ కలిగిన ఫుడ్ తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యల వస్తున్నాయని వైద్య నిపుణులు నిర్ధారణకు వచ్చారు. అయితే ప్యూరిన్ కలిగిన ఆహారాలను తీసుకోవడం పరిమితం చేస్తే..  యూరిక్ యాసిడ్‌ను చాలా వరకు నియంత్రించవచ్చు.

షుగర్ కలిగిన ఫుడ్స్ మానుకోండి:

యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంటే.. ముందుగా మీరు ఆహారంలో చక్కెర అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. తీపి పండ్లు, తేనెలో ఉండే ఫ్రక్టోజ్ యూరిక్ యాసిడ్‌ను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పండ్లు, తేనెలో కనిపించే సహజ చక్కెర. మీ శరీరం ఫ్రక్టోజ్‌ను విచ్ఛిన్నం చేయడంతో.. అది ప్యూరిన్‌లను విడుదల చేస్తుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది.

ఎక్కువ నీరు త్రాగండి:

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు నీరు పదే.. పదే తీసుకోవడం మంచిది. ఎక్కువగా నీరు త్రాగడం వల్ల యూరిక్ యాసిడ్‌ను తగ్గించుకోవచ్చు. మీరు ఎక్కువ నీరు త్రాగితే, యూరిక్ యాసిడ్ శరీరం నుంచి మూత్రం ద్వారా సులభంగా బయటకు వస్తుంది. అంతే కాదు మీరు తీసుకున్న ఫుడ్ కూడా వేగంగా జీర్ణం అవుతుంది. జీర్ణ ప్రక్రియ వేగంగా జరగడం వల్ల మీరు యాక్టివ్‌గా ఉంటారు.

మద్యం మానుకోండి:

మీరు యూరిక్ యాసిడ్‌ను నియంత్రించాలనుకుంటే.. వెంటనే ఆల్కహాల్ తీసుకోవడం మానేయండి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. కిడ్నీ శరీరం నుంచి విషాన్ని తొలగించడం ఆపివేస్తుంది.

తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు

అధిక యూరిక్ యాసిడ్ చికిత్సకు మరొక మార్గం మీ ఆహారంలో తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకోవడం. తక్కువ కొవ్వు పాలు మరియు పెరుగు కోసం వెళ్ళండి మరియు రక్తంలో అధిక యూరిక్ ఆమ్లాన్ని నిరోధించండి.

కాఫీ :

కాఫీ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుందని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. కాఫీ వినియోగాన్ని పరిమితం చేయడం కూడా మంచిదే.. అయితే మీరు యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోండం.. ప్యూరిన్ కలిగిన ఆహార పదార్థాలను పక్కన పెట్టడం చాలా అవసరం.

యూరిక్ యాసిడ్ పెరుగుతన్నట్లుగా మనకు ముందుగా పాదల నొప్పి నుంచి మొదలవుతుంది. మడమ ప్రాంతంలో గౌట్‌ సమస్య కనిపిస్తుంది. అయితే ఉదయం లేవడంతో పాదలను నేలపై పెట్టేందుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది కాస్తా బొటన వేలు, ఆతర్వాత మోకాళ్ల నొప్పలకు దారి తీస్తాయి. తీవ్రమైన గౌట్ ఉన్నవారు మందులు తీసుకోవాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం