Dental Care: దంతాలు పసుపురంగులో ఉన్నాయా..? అయితే ఈ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలు తెల్లగా మారిసిపోతాయి..

|

Feb 25, 2022 | 2:35 PM

ఆరోగ్యకరమైన దంతాలు, అందం, ఆరోగ్యం రెండింటికీ అవసరం. మన దంతాలు శుభ్రంగా లేకపోతే.. అందమైన నవ్వు మనకు దైరమవుతుంది. దంతాలను అందంగా, మెరిసేలా చేస్తాయని చెప్పుకునే..

Dental Care: దంతాలు పసుపురంగులో ఉన్నాయా..? అయితే ఈ ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలు తెల్లగా మారిసిపోతాయి..
Teeth Whitening
Follow us on

ఆరోగ్యకరమైన దంతాలు(oral health), అందం, ఆరోగ్యం రెండింటికీ అవసరం. మన దంతాలు శుభ్రంగా లేకపోతే.. అందమైన నవ్వు మనకు దైరమవుతుంది. దంతాలను అందంగా(Dental Care), మెరిసేలా (Teeth Whitening)చేస్తాయని చెప్పుకునే అనేక ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ అవి దంతాలకు మాత్రమే హాని చేస్తాయి. దంతాల సమస్య కారణంగా ఆహారంను సరిగ్గా తీసుకోలేక పోతాం.. ఆహారం సరిగ్గా తీసుకోక పోతే ఆరోగ్యం చెడిపోతుంది. తెల్లగా మెరిసే పళ్లతోనే మన ముఖ సౌందర్యం సాధ్యమవుతుంది. దంతాలు పసుపు రంగులో ఉంటే మీ మొత్తం వ్యక్తిత్వానికి మచ్చలా మారుతుంది. ధూమపానం, పొగాకు వినియోగంతో పాటు.. మీ ఆహారం కూడా మీ దంతాలను పసుపు రంగులోకి మార్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో దంతాల మెరుపును పెంచుకోవడానికి మనం సహజమైన పద్ధతులను అనుసరించవచ్చు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను దూరం చేసే 5 ఆహారాల గురించి ఈ రోజు మీకు చెప్పబోతున్నాం. అయితే ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం.

యాపిల్స్ : యాపిల్స్‌లో నీరు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ దంతాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. యాపిల్స్‌లో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది లాలాజల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది నోటి లోపల హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి పనిచేస్తుంది.

క్యారెట్లు : జ్యూస్‌తో కూడిన క్యారెట్‌లను తీసుకోవడం వల్ల నోటిలో తగినంత లాలాజలం ఉత్పత్తి అవుతుంది, ఇది దంతాల పై పొరను దెబ్బతీసే ఎంజైమ్‌లను తటస్థీకరిస్తుంది. దీంతో దంతాలు మెరుస్తూ కనిపిస్తాయి.

స్ట్రాబెర్రీస్ : స్ట్రాబెర్రీలు దంత ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఆస్కార్బిక్ ఆమ్లం ఉంటుంది. ఇది దంతాలను మెరిసేలా చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది. నోటిలో బ్యాక్టీరియా పెరగకుండా నిరోధించే పాలీఫెనాల్స్ స్ట్రాబెర్రీలో పుష్కలంగా ఉంటాయి.

సిట్రస్ పండ్లు : సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇవి బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి దంతాలను కాపాడతాయి.

డ్రై ఫ్రూట్స్ : దంతాల నుంచి ఫలకాన్ని తొలగించడంలో డ్రై ఫ్రూట్స్ మనకు చాలా సహాయపడతాయి. బాదం, జీడిపప్పు మొదలైన డ్రై ఫ్రైట్స్ ఉండే ముఖ్యమైన నూనెలు కూడా దంతాలను శుభ్రపరచడంలో సహకరిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీరు దంతాలు మెరిసేలా చేయాలనుకుంటే క్రమం తప్పకుండా ఇవి తినండి.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live: ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా.. నిరాశ్రయులైన లక్షల మంది.. 

Russia Ukraine Crisis: పుతిన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..