Health Tips: ఈ ఆహారంతో పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్‌ పెట్టవచ్చు.. అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి

|

Feb 07, 2022 | 8:31 PM

Health Tips: ప్రస్తుతం చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మేలంటున్నారు వైద్య నిపుణులు...

Health Tips: ఈ ఆహారంతో పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్‌ పెట్టవచ్చు.. అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి
Follow us on

Health Tips: ప్రస్తుతం చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మేలంటున్నారు వైద్య నిపుణులు. ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల పొత్తి కడుపులో క్యాన్సర్‌ల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫైబర్‌తో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల బ్రెస్ట్‌, జననేంద్రియ, గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ క్యాన్సర్ల ముప్పు గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా ఆయా క్యాన్సర్లకు అధిక ఫైబర్‌ ఆహారానికి గల సంబంధం ఏమిటనేదానిపై మరో అధ్యయనం నిర్వహించారు నిపుణులు. నేష‌న‌ల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌, నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేరీల్యాండ్ (యూఎస్ఏ) ఈ అధ్యయనాలను నిర్వహించాయి.

ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదాన్ని నివారిస్తుందని పరిశోధకులు అధ్యయనం ద్వారా తేల్చారు. అయితే అన్‌ప్రాసెస్డ్ ఫైబ‌ర్‌ను తీసుకోవాల‌ని, కూర‌గాయ‌లు, పండ్లు, తృణ‌ధాన్యాలు ఎక్కువ‌గా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉండే ఆహారంతో మనం తీసుకునే క్యాలరీలు తగ్గుతాయని వివరించారు. ఆహార నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని మన అదుపులో పెట్టుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Weight Loss Tips: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. వెంటనే ఈ 5 పదార్థాలను పక్కన పెట్టండి..!

Raisins Side Effects: ఎండుద్రాక్షను అతిగా తింటున్నారా.. వీటివలన శరీరంలో కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకోండి..