COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా.. పరిశోధనలు ఏం చెబుతున్నాయి..

|

Oct 31, 2021 | 2:11 PM

చాలా మంది వ్యక్తులు కొవిడ్-19 వ్యాక్సిన్‌లను తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు భయపడుతున్నారు. కానీ అలాంటి సంక్లిష్టతలు ఉండవచ్చా?..

COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా.. పరిశోధనలు ఏం చెబుతున్నాయి..
Vak
Follow us on

చాలా మంది వ్యక్తులు కొవిడ్-19 వ్యాక్సిన్‌లను తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు భయపడుతున్నారు. కానీ అలాంటి సంక్లిష్టతలు ఉండవచ్చా? బ్రాడ్‌కాస్టర్ స్కై స్పోర్ట్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, జర్మనీ యొక్క స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు మరియు ఎఫ్సీ బేయర్న్ మిడ్‌ఫీల్డర్ జాషువా కిమ్మిచ్, కోవిడ్-19 వ్యాక్సిన్‌ల ప్రభావాల గురించి దీర్ఘకాలిక అధ్యయనాలు లేకపోవడం వల్ల వాటి గురించి తనకు ఇంకా సందేహాలు ఉన్నాయని చెప్పారు.టీకాకు ప్రతిచర్యలు సాధారణంగా టీకా వేసిన కొద్దిసేపటికే జరుగుతాయి. అవి చాలా రోజుల పాటు కొనసాగవచ్చు అన్నారు. ఇప్పటికే వ్యాక్సిన్‌ తీసుకున్నవారు సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ లేదా గుండె కండరాల వాపు వంటి చాలా అరుదైన దుష్ప్రభావాలు ఎదురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 6.8 బిలియన్ల కంటే ఎక్కువ వాక్సిన్ డోసులు ఇచ్చారు. చాలా తక్కువ మందికి దుష్ప్రభావాలు ఎదురయ్యాయని ఇమ్యునాలజిస్ట్ ఫోర్స్టర్ వివరించారు.

ఆస్ట్రాజెనెకాకు సంబంధించిన థ్రాంబోసిస్ కేసుల గురించి ఏమిటి?

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన తర్వాత మాత్రమే ఆరోగ్య అధికారులు కనుగొన్న అరుదైన దుష్ప్రభావాన్ని ఫర్‎స్టార్ ధృవీకరించారు. రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వచ్చాయి. ( మెదడులో సెరిబ్రల్ సిరల సైనస్ థ్రాంబోసిస్).” క్లినికల్ ట్రయల్స్ లో ఇవి బయటపడలేదని ఆమె చెప్పారు.ఆస్ట్రేలియన్ ఆరోగ్య అధికారుల ప్రకారం, ఆస్ట్రాజెనెకాతో టీకాలు వేసిన 1 మిలియన్లలో గరిష్టంగా నాలుగు నుండి ఆరుగురికి థ్రాంబోసిస్ వచ్చింది. థ్రాంబోసిస్ కేసులు ఎక్కువగా వ్యాక్సినేషన్ తర్వాత రెండు నుండి మూడు వారాల తర్వాత వచ్చాయని జర్మనీ యొక్క ఫెడరల్ సెంటర్ ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్ తెలిపింది.

టీకా శరీరం నుండి క్లియర్ కావడానికి ఎంత సమయం పడుతుంది?
లేదా మడోర్నా నుంచి mRNA వ్యాక్సిన్‌, జన్సన్ అండ్ జన్సన్ నుంచి వెక్టర్ టీకాలను ఈయూలో ఆమోదించింది. mRNA టీకాలు వైరస్ యొక్క నిర్దిష్ట భాగం కోసం బ్లూప్రింట్‌ను కలిగి ఉంటాయి – అవి ఇంజెక్ట్ చేసిన తర్వాత, రోగనిరోధక వ్యవస్థ ప్రేరేపించబడుతుంది. వెక్టర్ వ్యాక్సిన్‌లు స్పైక్ ప్రోటీన్ కోసం జన్యు నమూనాను కలిగి ఉంటాయి. ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి.

ఇతర వ్యాక్సిన్‌లతో సంబంధం ఉన్న దుష్ప్రభావాలు సంవత్సరాల తర్వాత కనుగొనబడ్డాయా?
స్వైన్ ఫ్లూకు వ్యతిరేకంగా పాండెమ్రిక్స్ వ్యాక్సిన్‌తో చాలా అరుదైన దుష్ప్రభావం వచ్చింది. నార్కోలెప్సీ, నిద్ర రుగ్మత – టీకా ప్రవేశపెట్టిన చాలా కాలం వరకు గుర్తించబడలేదు. “ఈ దుష్ప్రభావం సంభవించే వరకు టీకాలు వేసిన వారిని చాలా కాలం పాటు గమనించవలసి ఉంటుంది. కానీ ఇప్పటికే చాలా మందికి టీకాలు వేయబడ్డాయి” అని ఇమ్యునాలజిస్ట్ ఫోర్స్టర్ వివరించారు. టీకాలు వేసిన వ్యక్తుల యొక్క పెద్ద సమూహం ఉన్నప్పుడు మాత్రమే చాలా అరుదైన దుష్ప్రభావాలు కనిపిస్తాయన్నారు.

కోవిడ్-19 వ్యాక్సిన్‌ల తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు నివేదించబడ్డాయి?
పాల్ ఎర్లిచ్ ఇన్స్టిట్యూట్, వ్యాక్సిన్‌లు, బయోమెడిసిన్‌లను నియంత్రించే, పరిశోధించే జర్మన్ ఫెడరల్ హెల్త్ ఏజెన్సీ, COVID-19 వ్యాక్సిన్ల చాలా అరుదైన దుష్ప్రభావాలను జాబితా తయారు చేసింది. వాటిలో మయోకార్డిటిస్, గుండె కండరాల వాపు, పెర్కిర్డిటిస్, పెరికార్డియం యొక్క వాపు ఉన్నాయి. అనాఫిలాక్టిక్ ప్రతిచర్యలు, మస్తిష్క సిరల సైనస్ థ్రోంబోసెస్, గుల్లెయిన్-బారే సిండ్రోమ్, థ్రోంబోసైటోపెనియా లేదా రోగనిరోధక థ్రోంబోసైటోపెనియా జాబితాలో ఉన్నాయి.

కోవిడ్-19 వ్యాక్సిన్‌లకు సంబంధించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేవు
జర్మనీలోని ప్రముఖ ఇమ్యునాలజీ నిపుణులు COVID-19 టీకాల ఫలితంగా సంవత్సరాల తర్వాత ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాన్ని తోసిపుచ్చారు. మానవ శరీరం టీకాను స్వీకరించిన వెంటనే లేదా కొన్ని వారాల తర్వాత వ్యాక్సిన్‌కు ప్రతిస్పందిస్తుందని చెప్పారు. చాలా తక్కువు సందర్భాల్లో సెరిబ్రల్ సిరల సైనస్ థ్రాంబోసిస్ లేదా గుండె కండరాల వాపు వస్తాయన్నారు.

Read Also..Cold Water Shower: స్నానం చివరలో ఇలా చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందట.. ఆసక్తికర విశేషాలు మీకోసం..