Bath Tips: స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. ఆరోగ్యానికి ప్రమాదంగా మారవచ్చు.. జాగ్రత్త..

|

Nov 13, 2022 | 6:43 AM

మారిపోతున్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కరోనా తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనవిధానంపై దృష్టి సారిస్తున్నారు....

Bath Tips: స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. ఆరోగ్యానికి ప్రమాదంగా మారవచ్చు.. జాగ్రత్త..
Bathing
Follow us on

మారిపోతున్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కరోనా తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనవిధానంపై దృష్టి సారిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రతి మనిషి జీవితంలో పరిశుభ్రత చాలా ఇంపార్డెంట్. స్నానం, శుభ్రత గురించి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. స్నానం చేస్తే శరీరం శుభ్రం అవ్వడమే కాదు.. అలసట, ఒళ్లు నొప్పులు, నిద్రలేమి వంటి ఇబ్బందులు ఎన్నో దూరం అవుతాయి. కానీ కొంతమంది స్నానం చేసేప్పుడు బాత్రూంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా వర్కవుట్స్, వ్యాయామం చేసినప్పుడు శరీరానికి చెమట పడుతుంది. అయితే చాలా మంది కేవలం టవల్ తో తుడుచుకుంటారు. కానీ స్నానం మాత్రం చేయారు. అలాంటి వారు వర్కవుట్‌ అయిన వెంటనే స్నానం చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్కవుట్‌ చేసిన తర్వాత చెమట కారణంగా చర్మంపై బ్యాక్టీరియా ఉంటుంది. వెంటనే స్నానం చేయకపోతే చర్మ సమస్యలు వస్తాయి.

బాత్ టబ్ చేసే అలవాటు ఉన్న వారు స్నానం చేసిన వెంటనే బాత్ టబ్ ను శుభ్రం చేయాలి. తేమ కారణంగా అందులో ప్రమాదకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బాత్‌ టబ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చు. చాలా మంది ఒకే టవల్‌ ను చాలా రోజులుగా వాడుతుంటారు. ఆ పని మాత్రం ఎప్పుడూ చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. టవల్‌ను ఒళ్లు తుడుచుకోవడానికి మూడు సార్లు మాత్రమే వాడాలని అంటున్నారు. ఆ తర్వాత దాన్ని ఉతకాలని సూచిస్తున్నారు. తడిగా ఉన్న టవల్‌తో తుడుకోవద్దు. తడి టవల్‌ ఉపయోగిస్తే దానిపై ఉండే బ్యాక్టీరియా మళ్లీ శరీరంపై చేరిపోతుంది.

ఉదయాన్నే చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అయితే నిద్రపోయే ముందు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు బలహీనంగా, పలుచగా ఉన్నవారు ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిది కాదు. వారానికి రెండుసార్లు హెడ్‌ బాత్‌ చేయడం బెస్ట్. చాలా మంది షవర్‌ను ఉపయోగిస్తుంటారు. కానీ షవర్‌ హెడ్‌ను శుభ్రం చేయరు. ఇలా షవర్‌ చేస్తే ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..