Health: నిద్ర లేవగానే ఆకలి వేస్తోందా.. వీటిని మాత్రం తినకండి.. తింటే ఇక అంతే..

రాత్రంతా నిద్రపోయి.. తెల్లవారి నిద్రలేచిన తర్వాత మనలో చాలా మందికి ఆకలి వేస్తుంది. ఏదో ఒకటి తిని ఆరోగ్య సమస్యలను తెచ్చుకోవానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా...

Health: నిద్ర లేవగానే ఆకలి వేస్తోందా.. వీటిని మాత్రం తినకండి.. తింటే ఇక అంతే..
Early Morning Eating
Follow us

|

Updated on: Jan 15, 2023 | 7:09 AM

రాత్రంతా నిద్రపోయి.. తెల్లవారి నిద్రలేచిన తర్వాత మనలో చాలా మందికి ఆకలి వేస్తుంది. ఏదో ఒకటి తిని ఆరోగ్య సమస్యలను తెచ్చుకోవానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా చలికాలంలో ఖాళీ కడుపుతో ఏదంటే అది తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే కొన్నిరకాల పండ్లు, కూరగాయలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్య సమస్యలను తీసుకొస్తాయి. జీవక్రియలు మందగించిపోవడం, జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. నారింజ, ద్రాక్షపండ్ల వంటి సిట్రస్ జాతి పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిలో అధిక మొత్తంలో ఉండే ఫైబర్, ఫ్రక్టోజ్ జీవక్రియలను నెమ్మదిస్తాయి. కడుపు సమస్యలు, గుండెల్లో మంట పుట్టిస్తాయి. ఉదయం పూట స్పైసీ ఫుడ్స్, మిరపకాయలు తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. రోజంతా ఆరోగ్యాన్ని ఇబ్బందికరంగా తయారు చేస్తుంది.

ఉదయం నిద్ర లేవగానే చాక్లెట్లు తినకూడదు. వీటిలో చక్కెర కంటెంట్ ఇన్సులిన్ లెవెల్స్ ను పెంచుతుంది. స్వీట్స్‌ కాకుండా ఇతర చక్కెర ఆహారాలను కూడా దూరం పెట్టాలి. సోడా వంటి ఎరేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. సోడాలను దూరం పెట్టి ఆరోగ్యానికి పనికొచ్చే గ్రీన్ టీ వంటి పానీయాలను తీసుకోవాలి. క్యారెట్ వంటి పచ్చి కూరగాయలను ఖాళీ కడుపుతో తినకూడదు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. డైటింగ్‌ చేస్తున్నప్పటికీ ఉదయాన్నే పచ్చి కూరగాయలతో కూడిన సలాడ్‌లను తినకుండా చూసుకోవాలి.

ఐస్‌డ్ టీ లేదా కాఫీ వంటి శీతల పానీయాలు తాగడం ద్వారా రోజును ప్రారంభించడం మానుకోవడం ఉత్తమం. కాఫీ ప్రియులు ఉదయం పూట తమకెంతో ఇష్టమైన పానీయం తాగడం మానుకోవాలి. ఉదయం పూట కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ ఏర్పడుతుంది. పెరుగు వంటి పులియబెట్టిన పాల ఉత్పత్తులను ఖాళీ కడుపుతో తినకుండా చూడాలి. ఇవి జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

Latest Articles
కదులుతున్న బస్సులో చలరేగిన మంటలు.. 9 మంది సజీవ దహనం
కదులుతున్న బస్సులో చలరేగిన మంటలు.. 9 మంది సజీవ దహనం
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
ఇకపై 17 జిల్లాలే.. 33 కాదు.. జిల్లాలను కుదించే యోచనలో సీఎం రేవంత్
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
మీకు చెవి నొప్పి ఉందా..? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..ప్రమాదమే!
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
పోలింగ్ రోజు అల్లర్లపై వేగంగా దర్యాప్తు.. ఈ నియోజకవర్గాల్లో సిట్
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
స్టాక్ మార్కెట్ పేరుతో స్కామ్.. రూ. లక్షల్లో టోకరా..
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
రేపటితో ముగుస్తున్న తెలంగాణ లాసెట్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
ఏపీలోని ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు.!
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..