Winter Health: జలుబు చేసిందని ఆవిరి పడుతున్నారా.. మీకు తెలియని అద్భుత టిప్స్ ఇవిగో..

|

Nov 06, 2022 | 5:31 PM

శీతాకాలం స్టార్ట్ అయిపోయింది. పొద్దు పొద్దునే చలి వణిస్తూ హాయ్ చెబుతోంది. మారుతున్న వాతావరణం, ఉష్ణోగ్రతలలో తగ్గుదల కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో జలుబు, దగ్గు, జ్వరం చాలా కామన్ అయిపోయాయి. ఈ సమస్యలను..

Winter Health: జలుబు చేసిందని ఆవిరి పడుతున్నారా.. మీకు తెలియని అద్భుత టిప్స్ ఇవిగో..
steaming water made with mint and tulsi leaves
Follow us on

శీతాకాలం స్టార్ట్ అయిపోయింది. పొద్దు పొద్దునే చలి వణిస్తూ హాయ్ చెబుతోంది. మారుతున్న వాతావరణం, ఉష్ణోగ్రతలలో తగ్గుదల కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో జలుబు, దగ్గు, జ్వరం చాలా కామన్ అయిపోయాయి. ఈ సమస్యలను నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే ఉత్తమ మార్గం. అయితే.. ముక్కు కారటం, దగ్గుతో బాధపడుతుంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. వంట గదిలో ఉండే వస్తువుల సహాయంతో డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వ్యాధి ని నివారించుకోవచ్చు. జలుబు చేసిన సమయంలో అందరూ సూచించే ఒకే ఒక పద్ధతి ఆవిరి పట్టడం. దీనిని వైద్యులు కూడా సిఫార్సు చేశారు. వేగవంతమైన, సత్వర ఉపశమనం, సమర్థవంతమైన ఫలితాలను పొందడానికి ఆవిరి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే ఆవిరి పట్టడంలోనూ కొన్ని చిట్కాలు, ఆయుర్వేద ఔషధాలను యాడ్ చేసుకుంటే అదనపు బెనెఫిట్స్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందు కోసం సరికొత్త ఆవిర పద్ధతిని పరిచయం చేస్తున్నారు.

ఒక టీ స్పూన్ యాలకులు, 10 నుంచి 15 తులసి ఆకులు, చిటికెడు పసువు, 4 నుంచి 5 పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి 5 నిమిషాల పాటు పాత్రను మూతతో కప్పి ఉంచాలి. తర్వాత ఒక పెద్ద, మందపాటి టవల్ను తీసుకుని తలపై ఉంచాలి. వేడినీటితో ఉన్న పాత్రను టేబుల్‌పై ఉంచాలి. మీ ముఖాన్ని పాత్ర పైన ఉంచాలి. ముఖాన్ని, పాత్రను టవల్‌తో పూర్తిగా కప్పాలి. లోపలి గాలి బయటకు వెళ్లకుండా, బయటి గాలి లోపలికి రాకుండా కప్పుకోవాలి. అయితే ముఖానికి, పాత్రకు మధ్య తగినంత దూరం ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే వేడి నీటి నుంచి వచ్చే వేడి ముఖానికి హాని కలిగించవచ్చు. ఇలా 45-60 సెకన్లకు ఒకసారి చేస్తూ ఆవిరి పట్టాలి.

దీర్ఘంగా ఆవిరి పట్టడం ద్వారా ముక్కు ద్వారాల్లో పేరుకున్న శ్లేష్మం ఆవిరవుతుంది. శ్వాసనాళాల్లో చేరుకున్న కఫం తేలికవుతుంది. తద్వారా ఈజీగా శ్వాస తీసుకునే అవకాశం కలుగుతుంది. ఊపిరితిత్తులకు రిలీఫ్ కలుగుతుంది. జలుబు, దగ్గును నయం చేస్తుంది. సైనస్‌ను నుంచి మీకు విముక్తి కలిగిస్తుంది. అంతే కాకుండా తేలికైన అనుభూతిని కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..