
అన్ని పండ్లలోకెల్లా దానిమ్మ (Pomegranate) ప్రత్యేకమైనది. ఎర్రటి గింజలతో నిగనిగలాడుతూ..చూస్తేనే నోరూరిపోయే ఈ పండును చిన్నా పెద్దా అనే లేకుండా అందరూ ఇష్టపడుతుంటారు. సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే దానిమ్మతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో ఎన్నో రకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇది శరీరాన్ని అన్ని రకాల అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. గుండె, మెదడు (Heart Health)-ఆరోగ్యానికి చక్కగా పని చేస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ – సీ అధిక మొత్తంలో ఉంటుంది. ఆకలి కలిగించే భావనను పెంపొందించడం వల్ల బరువు పెరగకుండా చూసుకుంటుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు స్థాయిలు ఎంత వరకు ఉన్నాయంటే.. గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా. అంతే కాకుండా ఇందులోని లిపోప్రొటీన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దానిమ్మపండులో 83 కిలో కేలరీలు, 13 గ్రాముల చక్కెర ఉంటుంది, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) 53 గా ఉంటుంది. ఇందులో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె పుష్కలంగా ఉుంటుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటు (బీపీ)ని తగ్గించడంలో సహాయపడుతుంది.
టైప్ – 2 డయాబెటిస్ నివారణ, చికిత్సకు దానిమ్మ అద్భుతంగా పని చేస్తుందని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. దానిమ్మలోని ఎల్లాజిక్, గాలిక్, ఒలియానోలిక్, ఉర్సోలిక్, ఆలిక్ యాసిడ్స్, టానిన్‌లు మధుమేహాన్ని నియంత్రించేందుకు చక్కగా పని చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. మధుమేహం ఉన్నవారిలో జరిపిన ఒక అధ్యయనంలో రోజూ దానిమ్మ రసం తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌లను 30 శాతం తగ్గించినట్లు తేలింది. భారతీయులు తమ ఆహార అలవాట్లలో పండ్లను అధికంగా వినియోగిస్తూ ఉంటారు. దానిమ్మపండ్లను సలాడ్ రూపంలో, జ్యూస్ ల రూపంలో తీసుకుంటారు. స్మూతీలు, స్నాక్స్ గా తీసుకుంటారు.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం.. క్లిక్ చేయండి