Health: గ్యాస్ సమస్యలతో సతమతమవుతున్నారా.. మొలకెత్తిన శనగలతో లాభాలు పుష్కలం

|

Jul 08, 2022 | 6:56 AM

శనగలు.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిని ఒక రకంగా ప్రోటీన్ల ఖజానాగా చెప్పవచ్చు. శనగల్లో ప్రొటీన్లే కాకుండా ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్లు దండిగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని...

Health: గ్యాస్ సమస్యలతో సతమతమవుతున్నారా.. మొలకెత్తిన శనగలతో లాభాలు పుష్కలం
Chickpease
Follow us on

శనగలు.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటిని ఒక రకంగా ప్రోటీన్ల ఖజానాగా చెప్పవచ్చు. శనగల్లో ప్రొటీన్లే కాకుండా ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్లు దండిగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు.. మొలకెత్తిన తర్వాత తింటే దాని గుణాలు మరింత పెరుగుతాయంటున్నారు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. రక్తప్రసరణను వేగంవంతం చేస్తుంది. శరీరం బలహీనంగా లేదా అలసిపోయినట్లు అనిపిస్తే గుప్పెడు మొలకెత్తిన శనగ గింజలు తినాలి. వీటిని తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి వచ్చి నూతనూత్సాహం పెంపొందుతుంది. రక్తహీనతకు శనగలు మంచి పరిష్కారం చూపిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి శనగలు ఉపశమనం కలిగిస్తాయి. ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

ఎముకలు బలహీనంగా ఉన్నవారు, ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు, కాల్షియం, ఐరన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా కలిగి ఉన్న శనగలు మంచి ఆహారంగా వైద్యులు చెబుతారు. బరువు తగ్గాలనుకునే వారికి శనగలు ఎంతో ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. పప్పును ఉదయం నుంచి రాత్రి వరకు నీళ్లలో నానబెట్టాలి. రాత్రిపూట నీటిని తీసి, ఒక గుడ్డలో వీటిని కట్టాలి. ఉదయానికి వీటి నుంచి మొలకలు వస్తాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక గుప్పెడు మొలకెత్తిన పప్పు తింటే మంచి ఫలితాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.