Health: నేరేడు పండ్లతో అద్భుత ప్రయోజనాలు.. ఈ పొరపాట్లు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు

|

Jul 15, 2022 | 9:06 PM

వర్షాకాలంలో విస్తారంగా లభ్యమయ్యే పండ్లల్లో నేరేడు (Black Berry) ఒకటి. ప్రకృతి వరప్రసాదమైన ఈ పండులో అద్భుత పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఫాస్ఫరస్‌, క్యాల్షియం, ఇనుము శరీరానికి కావాల్సిన...

Health: నేరేడు పండ్లతో అద్భుత ప్రయోజనాలు.. ఈ పొరపాట్లు చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు
Black Berry
Follow us on

వర్షాకాలంలో విస్తారంగా లభ్యమయ్యే పండ్లల్లో నేరేడు (Black Berry) ఒకటి. ప్రకృతి వరప్రసాదమైన ఈ పండులో అద్భుత పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పిండిపదార్థాలు, మాంసకృత్తులు, ఫాస్ఫరస్‌, క్యాల్షియం, ఇనుము శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందిస్తాయి. నేరేడు పండ్లను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగుతుంది. అయితే ఈ పండ్లు ఎంత ప్రయోజనం అయిప్పటికీ.. కొన్ని సార్లు మనం చేసే ఈ పొరపాట్లు తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తాయి. అందుకే వీటిని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. నేరేడు పండ్లు చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు అద్భుతంగా పని చేస్తాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే వీటిని సరైన కాంబినేషన్‌తో కలిపి తినకపోతే మాత్రం ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది.

నేరేడు పండ్లను తిన్న వెంటనే నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తిన్న వెంటనే నీళ్లు తాగితే.. డయేరియా, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను తినకూడదు. ఇవి పుల్లగా ఉండటం వల్ల కడుపులో ఎసిడిటీ, నొప్పి, చికాకు వంటి సమస్యలు కలిగిస్తాయి. కాబట్టి ఆహారం తిన్న తర్వాతే వీటిని తీసుకోవడం మంచిది. పాలు తాగడం వంటివి కూడా చేయవద్దు. భోజనం చేసిన తర్వాత నేరేడు పండ్లను తింటే జీవక్రియను వేగవంతం అవుతుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.