Health: చేదుగా ఉందని కాకరకాయను దూరం పెడుతున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే లొట్టలు వేయాల్సిందే..

|

Sep 22, 2022 | 2:37 PM

మన ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన అద్భుత పదార్థాల్లో కాకరకాయ ఒకటి. రుచికి చేదుగా ఉన్నా ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. శరీరంలో వచ్చే వివిధ రకాల అనారోగ్య కారకాలను...

Health: చేదుగా ఉందని కాకరకాయను దూరం పెడుతున్నారా.. ఈ ప్రయోజనాలు తెలిస్తే లొట్టలు వేయాల్సిందే..
Bitter Gourd
Follow us on

మన ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన అద్భుత పదార్థాల్లో కాకరకాయ ఒకటి. రుచికి చేదుగా ఉన్నా ఇది అందించే ఆరోగ్య ప్రయోజనాలు అంతా ఇంతా కాదు. శరీరంలో వచ్చే వివిధ రకాల అనారోగ్య కారకాలను బయటికి పంపించే అద్భుత ప్రయోజనాలు దీని సొంతం. సాధారణంగా రక్తంలో యూరిక్ యాసిడ్ అనేది వ్యర్థ పదార్థం. ఆహార పదార్థాల్లోని ‘ప్యూరిన్‌’ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్‌ యాసిడ్‌ తయారవుతుంది. ఈ ప్రక్రియను కిడ్నీలు సమర్థంగా చేస్తాయి. శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటకు మూత్రం రూపంలో పంపిస్తాయి. శరీరంలోని యూరిక్ యాసిడ్ బయటకు వెళ్లకుండా బాడీలోనే ఉండిపోతే చాలా రకాల దుష్ప్రభావాలు వస్తాయి. అధిక బరువు, డయాబెటిస్‌‌, వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కీళ్ల నొప్పి, నడకలో ఇబ్బంది, వాపు , కీళ్ల పగుళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా పురుషులలలో 3.4-7.0 mg వరకు యూరిక్ యాసిడ్, మహిళల్లో 2.4- 6.0 mg వరకు యూరిక్‌ యాసిడ్‌‌ ఉంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ అంతకు మించి పెరిగితే మాత్రం అనారోగ్యో సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సరైన పోషకాహారం తీసుకుంటూ, లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటే యూరిక్‌ యాసిడ్‌ సమస్యను తగ్గించుకోవచ్చు. ప్యూరిన్‌ ఎక్కువగా ఉండే క్యాబేజీ, స్క్వాష్, బెల్ పెప్పర్స్, వంకాయ, బీన్స్, దుంపలను తినకూడదు. అయితే వీటికి బదులుగా కాకరకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది యూరిక్‌ యాసిడ్‌ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. కాకరకాయలోని ఐరన్, మెగ్నీషియం, పొటాషియంతోపాటు విటమిన్‌ సీ ఉంటుంది. FDA ప్రకారం, 94 గ్రా బరువు కలిగిన కాకరకాయలో కేలరీలు 20, పిండి పదార్థాలు 4 గ్రాములు, విటమిన్ సీ 93% ఉంటుంది. కాకరకాయను తరచుగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి, క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మ సమస్యలు దూరం చేస్తుంది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..