Women Health Tips: ఓ నారీమణి.. ఆరోగ్యకరమైన జీవనం కోసం నీకు ఈ విటమిన్స్ తప్పనిసరి మరి..

ప్రతి మనిషి జీవితం ఆరోగ్యవంతంగా సాగాలంటే వివిధ పోషక అవసరాలు అవుతాయి. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించే మహిళలకు వివిధ వయసులలో...

Women Health Tips:  ఓ నారీమణి.. ఆరోగ్యకరమైన జీవనం కోసం నీకు ఈ విటమిన్స్ తప్పనిసరి మరి..
Women Health Tips

Updated on: Apr 10, 2021 | 9:46 PM

ప్రతి మనిషి జీవితం ఆరోగ్యవంతంగా సాగాలంటే వివిధ పోషక అవసరాలు అవుతాయి. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించే మహిళలకు వివిధ వయసులలో వేర్వేరు విటమిన్లు అవసరం. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ పోషణ అవసరం. ఆరోగ్యకరమైన జీవనం సాగించాలంటే..  ఆహారంలో మహిళలు అన్ని రకాల పోషకాలను కలిగి ఉండటం చాలా ముఖ్యం. స్త్రీ రుతుస్రావం,  గర్భం వంటి అనేక దశలను దాటుతుంది.  ప్రతి దశలో ఆరోగ్యంగా ఉండటానికి మహిళలకు కొన్ని ప్రత్యేక విటమిన్స్ తప్పనిసరి. గర్భిణీ స్త్రీకి టీనేజర్ కంటే భిన్నమైన విటమిన్లు అవసరం అవుతాయి.

ప్రతి స్త్రీ తీసుకోవలసిన 5 విటమిన్లు

విటమిన్ బి 12- ఇది చాలా అవసరమైన విటమిన్. ఇది మీ ఆహారాన్ని గ్లూకోజ్‌గా మారుస్తుంది.  శక్తిని పెంచుతుంది. స్త్రీ శరీరానికి చాలా శక్తి అవసరం. కాబట్టి, ఈ విటమిన్ ఎక్కువ పరిమాణంలో అవసరం. ఇది జీవక్రియను పెంచుతుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఫోలిక్ ఆమ్లం- స్త్రీ గర్భవతిగా ఉంటే లేదా గర్భవతి కావాలని యోచిస్తున్నట్లయితే…  ఫోలిక్ ఆమ్లం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది నాడీ సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫోలిక్ ఆమ్లం తల్లీబిడ్డ ఆరోగ్యవంతంగా ఉండేందుకు ఉపకరిస్తుంది

విటమిన్ కె-  ఓ అధ్యయనం ప్రకారం, పురుషుల కంటే ఎక్కువ మంది మహిళలు గుండెపోటు, ఇతర గుండె జబ్బులతో మరణిస్తున్నారు. విటమిన్ కె గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల ప్రతి స్త్రీ తన ఆహారంలో ఈ విటమిన్‌ను తప్పనిసరిగా చేర్చాలి. ఈ విటమిన్ ఎముకలను కూడా బలంగా చేస్తుంది.

మెగ్నీషియం – మెగ్నీషియం PMS కి చాలా మంచిది. ఇది నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది.  మీ మానసిక స్థితిని కూడా క్రమబద్దీకరిస్తుంది. ప్రతి స్త్రీ దీనిని తినాలి.

విటమిన్ డి – విటమిన్ డి చాలా ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ డి లోపం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్, ఉబ్బసం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ విటమిన్ డి సరైన మొత్తంలో తీసుకోవాలి.

Also Read: 57 ఏళ్ల మహిళ 62 ఏళ్ల తన భర్తను పక్కా స్కెచ్ వేసి హతమార్చింది.. షాకింగ్ రీజన్.. ఇలా కూడా ఆలోచిస్తారా..?

హృదయ విదారకం.. పిల్లలు లేరు.. 30 ఏళ్ల క్రితమే భార్య సమాధి పక్కన తన సమాధి సైతం నిర్మించుకున్న వైనం