Acidity: తరచూ ఎసిడిటీతో బాధపడుతున్నారా? అయితే అసలు విస్మరించొద్దు.. పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు..

|

Jul 16, 2022 | 9:35 PM

Health Tips: ఎసిడిటీ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. చాలామంది ఈ ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతుంటారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ముఖ్యంగా స్పైసీ ఫుడ్ వల్ల ఇది సంభవిస్తుంది. కొన్నిసార్లు ఖాళీ కడుపుతో

Acidity: తరచూ ఎసిడిటీతో బాధపడుతున్నారా? అయితే అసలు విస్మరించొద్దు.. పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు..
Acidity
Follow us on

Health Tips: ఎసిడిటీ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య. చాలామంది ఈ ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతుంటారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ముఖ్యంగా స్పైసీ ఫుడ్ వల్ల ఇది సంభవిస్తుంది. కొన్నిసార్లు ఖాళీ కడుపుతో ఉండడం వల్ల కూడా ఎసిడిటీ బాధిస్తుంది. అయితే చాలామందికి ఇంట్లో తిన్న తర్వాత కూడా ఎసిడిటీ సమస్యలు తలెత్తుతంటాయి. అయితే వారు దీనిని పెద్దగా పట్టించుకోరు. అయితే దీనిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సకాలంలో మందులు లేదా హోం రెమెడీస్‌ ద్వారా ఎసిడిటీ సమస్యలను తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే తరచూ ఎసిడిటీ సమస్యలు క్యాన్సర్‌కు కూడా కారణమవుతాయని ఇటీవల పలు పరిశోధనల్లో వెల్లడైంది. మరి ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధమేంటో తెలుసుకుందాం రండి.

ఎసిడిటీ, క్యాన్సర్ మధ్య సంబంధమేంటంటే..

ఎసిడిటీతో బాధపడటం అనేది ఒక సాధారణ సమస్య కావచ్చు. అయితే అది ఎవరినైనా క్యాన్సర్ రోగిగా మార్చగలదని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది క్రమంగా అన్నవాహిక సమస్యలకు దారితీస్తుందని ప్రస్తుతం చాలామంది దీనితో బాధపడుతున్నారని హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. దీనినే గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) గా పరిగణిస్తున్నారు. ఇది క్రమంగా అన్నవాహిక క్యాన్సర్‌ కు దారి తీసే ప్రమాదముందంటున్నారు. ఇక ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం, తరచుగా ఎసిడిటీ ఉన్నవారు, భవిష్యత్తులో అన్నవాహిక క్యాన్సర్‌తో బాధపడే అవకాశం ఉందంటున్నాయి. చాలా సందర్భాలలో, అన్నవాహిక క్యాన్సర్ గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్‌తో ముడిపడి ఉంటుందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. ఊబకాయం ఉన్నవారికి ఎసిడిటీ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ చిట్కాలను ఫాలో అవ్వండి..

  • కొన్ని జాగ్రత్తలతో ఎసిడిటీ సమస్య తొలగిపోవచ్చు. అయితే పదే పదే ఈ సమస్యలు తలెత్తుతుంటే మాత్రం కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
  • అదేవిధంగా తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నిద్రపోవడానికి 3-4 గంటల ముందే తినాలి.
  • ఇక ఎసిడిటీ నుండి ఉపశమనం కోసం ఇంటి చిట్కాలను ప్రయత్నించాలనుకుంటే, అందులో ఉసిరికాయ, జీలకర్ర, నల్ల ఉప్పు సహాయం తీసుకోండి. అందుకోసం ఈ మూడింటిని వేడినీళ్లుగా చేసుకుని రోజుకు ఒకసారి తాగాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి