గుడ్డులో ప్రొటిన్లు, అనేక రకాల పోషకాలు దాగున్నాయి. అందుకే ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ ఒక గుడ్డును తినాలని సూచిస్తారు. వాస్తవానికి చాలా మంది ఇళ్లల్లో గుడ్లను అల్పాహారంలో తింటారు. ఇంకా గుడ్ల నుంచి చాలా రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. ముఖ్యంగా చలికాలంలో గుడ్లను ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే సండే.. అయినా మండే అయినా ప్రతిరోజూ రోజూ గుడ్లు తినాలని చెబుతారు. మీరూ ప్రతిరోజూ 1-2 గుడ్లు తినొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రతిరోజూ గుడ్లు తింటే గుండెకు మంచిదేనా? గుడ్లు తినడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందా? ఒకవేళ హార్ట్ పేషెంట్ అయితే రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఇలాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
NCBI నివేదిక ప్రకారం.. రోజుకు 2 గుడ్లు తింటే ఊబకాయం తగ్గుతుంది. రోజూ గుడ్లు తినడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరుగుతాయి. గుడ్లు తినడం వల్ల శరీరానికి ప్రొటీన్లు, విటమిన్లు అందుతాయి. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించదు. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజూ 2 గుడ్లు తినాలని అనేక పరిశోధనలు సూచించాయి. అయితే, ఇతర ఆహారాల కంటే గుడ్లలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుందని చాలా నివేదికలు చెబుతున్నాయి.
గుడ్లలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి
1 గుడ్డులో దాదాపు 75 కేలరీలు, 5 గ్రాముల కొవ్వు, 6 గ్రాముల ప్రోటీన్, 0 కార్బోహైడ్రేట్లు, 70 గ్రాముల సోడియం, 67 మిల్లీగ్రాముల పొటాషియం, 210 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉన్నాయి. గుడ్లు విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ బి12 మంచి మూలం. గుడ్లలో కోలిన్ కూడా ఉంటుంది.. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది.
గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?
అధిక కొలెస్ట్రాల్ గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది మీ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. అయితే, గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్ శరీరాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయదని అనేక పరిశోధనలలో తేలింది. అవును గుడ్డును ఎలా తింటున్నారన్నది గమనించాల్సిన విషయం. మీరు దీన్ని చాలా నూనె లేదా వెన్నలో తయారు చేసి తింటుంటే ఈ రెండు పదార్థాలు కూడా శరీరానికి హాని కలిగిస్తాయి.
గుండె సమస్యలు ఉన్నవారు రోజూ ఎలా – ఎన్ని గుడ్లు తినాలి
గుండె రోగులు వారానికి 7 గుడ్లు అంటే ప్రతి రోజు ఒక గుడ్డు తినవచ్చు. గుడ్డులోని తెల్లని భాగాన్ని మాత్రమే తినడానికి ప్రయత్నించండి. ఇది కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది. ఇంకా శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది. మీరు ఎక్కువ పరిమాణంలో గుడ్లు తింటే.. గుడ్డు సొనను తినవద్దు. గుడ్లను ఉడకబెట్టడం ద్వారా లేదా చాలా తక్కువ వెన్న, లేదా నూనెలో తయారు చేయడం ద్వారా తినడానికి ప్రయత్నించండి. గుడ్డు గుండెకు హానికరం అనేది అపోహ మాత్రమేనని నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి