Egg Side Effects: మీరు గుడ్లను ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండొచ్చు..!

|

Aug 30, 2022 | 6:59 AM

Egg Side Effects: మనం తరచుగా అల్పాహారం లేదా ఇతర భోజనంతో గుడ్లు తినడానికి ఇష్టపడతాము. ఇది సూపర్ ఫుడ్‌గా పరిగణించబడుతుంది. ఆదివారం..

Egg Side Effects: మీరు గుడ్లను ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండొచ్చు..!
Egg Side Effects
Follow us on

Egg Side Effects: మనం తరచుగా అల్పాహారం లేదా ఇతర భోజనంతో గుడ్లు తినడానికి ఇష్టపడతాము. ఇది సూపర్ ఫుడ్‌గా పరిగణించబడుతుంది. ఆదివారం లేదా సోమవారం రోజూ గుడ్లు తినండి అనే నినాదాన్ని మీరు వినే ఉంటారు. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ప్రసిద్ది చెందుతోంది. అయితే రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? మనం ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి హాని ఉంటుంది..? అనే విషయాలు తెలుసుకోవడం మంచిది. గ్రేటర్ నోయిడాలోని GIMS హాస్పిటల్‌లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ గుడ్లు తినడానికి రోజువారీ పరిమితి గురించి వివరించారు.

గుడ్లలో ఉండే పోషకాలు

గుడ్లను సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. ఇది మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే దీన్ని రోజూ తినాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇన్ని న్యూట్రీషియన్స్ ఉన్నప్పటికీ వీటిని తినడంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి?

ఆరోగ్యకరమైన పెద్దలు ప్రతిరోజూ ఒక గుడ్డు తింటే సరిపోతుంది. కానీ చాలా మీ జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. మీకు ఏ వ్యాధి లేకపోతే 3 గుడ్లు కూడా తినవచ్చు. భారీ వ్యాయామం చేసే వారికి ఎక్కువ ప్రొటీన్లు అవసరం కాబట్టి గుడ్ల మొత్తాన్ని పెంచుకోవచ్చు.

ఎక్కువ గుడ్లు తినడం వల్ల కలిగే నష్టాలు

విరేచనాలు దేనికంటే

ఎక్కువగా ఉండటం సరికాదని అంటారు వైద్యులు. గుడ్లను ఎక్కువగా తినడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి తర్వాత మన శరీరం చాలా బలహీనంగా మారుతుంది. అందుకే మీ ఆహారపు అలవాట్లను నియంత్రించండి.

మలబద్ధకం

అవసరానికి మించి గుడ్లు తినడం మన జీర్ణవ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇది మలబద్ధకం సమస్యకు దారి తీస్తుంది. కొన్ని సందర్భాల్లో కడుపు ఉబ్బరం, కడుపులో చికాకు, గ్యాస్ సమస్య తలెత్తే అవకాశం ఉందంటున్నారు.

కొలెస్ట్రాల్

గుడ్డులోని పచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. అయితే ఇది సంతృప్త కొవ్వు వలె హానికరం కాదు. అయితే ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు గుడ్లు తక్కువగా తినాలి. అయితే మరి ఎక్కువ గుడ్లు తినేవారిలో మాత్రమే ఈ సమస్యలు తలెత్తుతాయంటున్నారు డాక్టర్ ఆయుషి యాదవ్.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..