Toothache Home Remedies: ప్రస్తుతం పెద్దవారి నుంచి చిన్నవారి వరకూ చిరు తిండ్లకు అలవాటు పడ్డారు..దీంతో దంతాలకు సంబందించి వ్యాధులు రావడం సర్వసాధారణంగా మారింది. ఎక్కువ మంది పంటి నొప్పితో బాధపడుతూనే ఉన్నారు. దీనికి కారణం ఎక్కువగా తీపి పదార్ధాలు తినడం ఒకటి అయితే.. సరిగా పండ్లను శుభ్రపరచుకోకపోవడం ఒక కారణం.. అయితే పంటి నొప్పి వస్తే.. అది భరించడం కష్టమని చెప్పవచు. మనం తినే తీపి పదార్థములు పిండి పదార్థాలతో పంటిపై గారలు ఏర్పడతాయి. వాటిలో సూక్ష్మ జీవులు చేరతాయి. దీంతో పంటిపై ఉన్న ఎనామిల్ పాడవుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏర్పడడం పిప్పళ్ల వంటివి ఏర్పడి నొప్పి కలుగుతుంది. ఇక అప్పుడు పంటి నరాలకు దంతమూలాలకు చేరి పళ్లను పాడుచేస్తాయి. అయితే పంటి నొప్పి వచ్చినప్పుడు తగ్గడానికి తీసుకోవల్సివ జాగ్రత్తలు.. సింపుల్ వంటింటి చిట్కాలు గురించి తెలుసుకుందాం..
*వెల్లుల్లి, లవంగంను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే కొద్ది సేపట్లోనే ఉపశమనం కలుగుతుంది. ఈ పేస్ట్ వలన దీర్ఘకాలిక పంటి నొప్పి కూడా తగ్గుతుంది.
*పంటి నొప్పి ఉన్న చోట లవంగాన్ని ఒక నాలుగు, ఐదు గంటల పాటు ఉంచితే కొంచెం తిమ్మిరి కలిగి తర్వాత నొప్పి మాయమవుతుంది. ఈ చిట్కాతో మంచి ఉపశనం లభిస్తుంది.
*కాగితపు టవల్ పైన విక్స్ లేదా అమృతాంజన్ ను రాసి నొప్పి ఉన్న దవడ ప్రాంతంలో చర్మం పై కాసేపు ఉంచినట్లైతే నొప్పి తగ్గు ముఖం పడుతుంది.
*దంత శుద్దికి, పంటి నొప్పికి గోధుమ గడ్డి రసం ను ఉపయోగిస్తారు. యిది చక్కని ఆయుర్వేదంలా పనిచేసి దంత క్షయాన్ని నొప్పిని నివారిస్తుంది.
*పంటి నొప్పి ఉన్న దంత భాగంలో ఐస్ క్యూబ్ పెడితే నొప్పి తగ్గిపోతుంది.
*చిగుళ్ల వాపు , నొప్పి తగ్గడానికి మిరియాల పొడిని దంత మంజన్ లా వాడి పళ్లపై రుద్దితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
*పంటి నొప్పితో బాధపడేవారు ఉల్లిపాయను మూడు నిమిషాలు నమిలితే పంటి నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. నమలడం యిబ్బంది అనుకుంటే అప్పుడే కోసిన ఉల్లిముక్కని నొప్పి దగ్గర పెడితే నొప్పి మాయం అవుతుంది
ఈ చిన్న చిట్కాలను పాటించి పంటి నొప్పిని తగ్గించుకోండి. అయితే పంటి సమస్యతో బాధపడేవారే కాదు.. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా రోజూ ఉదయం.. సాయంత్రం నిద్రపోయే ముందు రెండు పూటలా బ్రష్ చేసుకోవడం మంచిది. ఈ అలవాటు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఏదైనా తిన్నపుడు వెంటనే నోటిని పరిశుభ్రం చేసుకోవాలి.
Also Read: Chanakya Niti: ప్రపంచంలో తెలివైన వ్యక్తికి శత్రువులుండరు ఎందుకంటే వారు ఇలా పనిచేస్తారంటున్న చాణక్య