Toddler Cough and Cold Remedies:చిన్నారుల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ కేరింగ్ గానే ఉంటారు. ఇక సీజన్ మారినప్పుడల్లా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న కొంతమంది చిన్నారులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడతారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన కలుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చిన్నారులకు వచ్చే దగ్గు, గొంతు నొప్పి, జలుబు సమస్యలు అధికం.. ఇవి చిన్నారులను అధికంగా ఇబ్బంది పెడతాయి. దీంతో ఎక్కువగా అల్లోపతి వైద్యం వైపు చూస్తారు కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాలు మంచి ఉపశమనఁ ఇస్తాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ చిన్న చిట్కాల వలన చిన్నారులకు సైడ్ ఎపెక్ట్స్ వంటివి ఉండవని అంటున్నారు. ఇప్పుడు చిన్నారుల్లో వచ్చే దగ్గు, గొంతునొప్పి, జలుబు సమస్యలకు సహజసిద్ధమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..
*వర్షాకాలంలో చిన్నారులకు తలంటు స్నానం చేయించే ముందు చెవుల్లో రెండు చుక్కల నువ్వుల నూనె వేయాలి. దీని వల్ల శ్వాస కోశ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది ఇంట్లో పెద్దలు ఉంటె వారు పిల్లలకు స్నానం చేయిస్తే తప్పనిసరిగా ఆచరించే పద్దతి
* కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కలిపి ఈ మిశ్రమాన్ని నోట్లో వేసి.. గోరు వెచ్చని నీరు తాగిస్తే.. దగ్గు జలుబుతో ఉపశమనం లభిస్తుంది.
* గొంతు నొప్పి, దగ్గుతో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు వాము, ఉప్పు, పసుపు వేడిచేసి గుడ్డలో కట్టి గొంతుకు కాపడం పెట్టినా ఉపశనం లభిస్తుంది.
*పసుపు కొమ్ములు, గోధుమలను సమానంగా తీసుకుని వాటిని మట్టి మూకుడులో వేసి నూనె లేకుండా దోరగా వేయించాలి. మెత్తగా పొడి చేశాక 50 మిల్లీగ్రాముల పొడిని ఒక టీస్పూన్ తేనెతో ఉదయం, సాయంత్రం పిల్లలకు ఇవ్వాలి. దీని వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.
* వాము టీస్పూన్, బెల్లం 4 టీస్పూన్లు తీసుకుని వీటిని మెత్తగా నూరి ఒక కప్పు నీళ్లలో వేసి మరిగించాలి. నాలుగో వంతు మిగిలే వరకు మరిగించి చల్లార్చాలి. తరువాత చిన్నారులకు ఆరు గంటలకు ఒకసారి ఆ మిశ్రమాన్ని తాగించాలి. ఈ కషాయంతో జలుబు, గొంతు నొప్పి, దగ్గు తగ్గుతాయి.
* ఇన్‌ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు పసుపు, పటికబెల్లం పొడి నిప్పులపై వేసి ఆ పొగను తలవైపు నుంచి వేయాలి. ఇలా చేస్తే ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది.
*నిమ్మరసంలో కొద్దిగా తేనె, గోరు వెచ్చని నీళ్లను కలిపి కొద్ది కొద్దిగా ఇస్తుండాలి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి తగ్గుతాయి.
Also Read: