Sweet Potatoes Side Effects: చిలగడదుంపలను తింటున్నారా..? అయితే మీరు తప్పక తెలుసుకోవలసిన విషయాలివే.. జాగ్రత్త సుమా..!

|

Jan 26, 2023 | 5:31 PM

నేల లోపల పండే దుంపలలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అలాంటి దుంపలలో స్వీట్‌..

Sweet Potatoes Side Effects: చిలగడదుంపలను తింటున్నారా..? అయితే మీరు తప్పక తెలుసుకోవలసిన విషయాలివే.. జాగ్రత్త సుమా..!
Sweet Potatoes Side Effects
Follow us on

నేల లోపల పండే దుంపలలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అలాంటి దుంపలలో స్వీట్‌ పొటాటోస్‌ లేదా చిలగడదుంపలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో కార్బో హైడ్రేడ్స్, ప్రోటీన్లు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఈ రూట్ వెజిటేబుల్ పోషకాలతో సమృద్దిగా ఉంటుంది. ఇందులో ప్రొటీన్, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి, ఆర్థరైటిస్‌తో పోరాడుతున్న వారికి, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది వారికి హాని చేస్తుంది. మరి ఎవరెవరు చిలకడదుంపలకు దూరంగా లేదా వాటిని తక్కువగా తినాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. మూత్రపిండంలో రాళ్లు ఉన్నవారు: కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఆహారంలో చిలగడదుంపను ఎక్కువగా చేర్చుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇందులోని ఆక్సలేట్ కిడ్నీలో రాళ్ల వల్ల కలిగే నొప్పిని పెంచుతుంది. దీనివల్ల మీకు మరింత హాని కలుగవచ్చు.
  2. ఉదర సమస్యలున్నవారు: చిలగడ దుంపలు మన్నిటాల్‌ను కలిగి ఉంటాయి. ఇది షుగర్ ఆల్కహాల్ లేదా పాలియోల్ అనే కార్బోహైడ్రేట్ రకం. ఈ కార్బోహైడ్రేట్ తీసుకోవడం వల్ల ఎటువంటి హాని లేనప్పటికీ పొట్ట సమస్యలతో బాధపడేవారికి సమస్యలను కలిగిస్తుంది. పొట్ట సమస్యలతో బాధపడుతున్నప్పుడు చిలగడదుంపను ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, కడుపు నొప్పి, ఉబ్బరం వంటివి వస్తాయి. అందువల్ల పొట్ట సమస్యలు ఉన్నవారు వీటిని తినడం మంచిది కాదు.
  3. మధుమేహం వ్యాధిగ్రస్థులు: బంగాళదుంపలతో పోలిస్తే చిలగడదుంపలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. చిలగడదుంపలు తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కంటెంట్ కలిగి ఉండటం వల్ల చిలగడదుంప శరీరంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ అది ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.
  4. గుండె సమస్యలు ఉన్నవారు: ఇందులో పొటాషియం దండిగా ఉంటుంది. చిలగడదుంప మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కానీ అతిగా తీసుకుంటే ప్రమాదకరం. పొటాషియం అధికంగా తీసుకోవడం వల్ల హైపర్‌కలేమియా లేదా పొటాషియం టాక్సిసిటీకి దారి తీయవచ్చు ఇది గుండెపోటుకు దారితీస్తుంది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..