Diabetes Risk Foods: వారానికి రెండు సార్లు రెడ్ మీట్ తింటున్నారా.. అయితే చాలా డేంజర్!

| Edited By: Ram Naramaneni

Oct 20, 2023 | 2:28 PM

ప్రస్తుతం చాలా మంది బాధ పడే అనారోగ్య సమస్యల్లో డయాబెటీస్ కూడా ఒకటి. మధు మేహం ఒక్కసారి వచ్చిందంటే.. చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. షుగర్ వచ్చిందంటే.. అంత మూములుగా పోదు. మధు మేహం వచ్చిన వారు ఆరోగ్య పరంగా, తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులకు గురికాక తప్పదు. అయితే డయాబెటీస్ తో బాధ పడేవారు నాన్ వెజ్ తినకూడదని అంటారు. ముఖ్యంగా రెడ్ మీట్ అస్సలు తినకూడదని, తింటే బ్లడ్ లో షుగర్ లెవల్స్..

Diabetes Risk Foods: వారానికి రెండు సార్లు రెడ్ మీట్ తింటున్నారా.. అయితే చాలా డేంజర్!
Diabetes
Follow us on

ప్రస్తుతం చాలా మంది బాధ పడే అనారోగ్య సమస్యల్లో డయాబెటీస్ కూడా ఒకటి. మధు మేహం ఒక్కసారి వచ్చిందంటే.. చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. షుగర్ వచ్చిందంటే.. అంత మూములుగా పోదు. మధు మేహం వచ్చిన వారు ఆరోగ్య పరంగా, తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇబ్బందులకు గురికాక తప్పదు. అయితే డయాబెటీస్ తో బాధ పడేవారు నాన్ వెజ్ తినకూడదని అంటారు. ముఖ్యంగా రెడ్ మీట్ అస్సలు తినకూడదని, తింటే బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరుగుతాయని వైద్యులే సూచిస్తారు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా చాలా మంది రెడ్ మీట్ ని తినేస్తారు. అయితే తాజాగా జరిగిన పరిశోధనల ప్రకారం.. వారానికి రెండు సార్లు రెడ్ మీట్ తినడం వల్ల బ్లడ్ లో చక్కెర స్థాయిలు అనేవి విపరీతంగా పెరుగుతున్నాయట. కాబట్టి రెడ్ మీట్ కి దూరంగా ఉండాలని వెల్లడించారు.

ఆహారంలో మార్పులు చేసుకోవాలి:

టైప్ 2 డయాబెటీస్ అనేది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ప్రపంచంలో 400 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రస్తుతం డయాబెటీస్ ఉన్నవారని తాజా లెక్కలు తేలాయి. మధు మేహం ఉన్నవారు మూత్ర పిండాల వైఫల్యం, గుండె పోటు, హార్ట్ స్ట్రోక్ వంటి వివిధ రోగాల బారిన పడుతున్నారు. టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవాలన్నా, ఆరోగ్యకరమైన బరువు తగ్గాలన్నా మీ ఆహారంలో తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రాసెస్ చేయని ఫ్రెష్ రెడ్ మీట్ తినాలి:

ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ పై, ప్రాసెస్ చేయని రెడ్ మీట్ పై పలు పరిశోధనలు చేశారు. ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ తినడం వల్ల 64 శాతం షుగర్ పెరిగే అవకాశం ఉందని, ప్రాసెస్ చేయని రెడ్ మీట్ తినడం వల్ల 24 శాతం మధు మేహం పెరుగుతుందని తేల్చారు. కాబట్టి ఒక వేళ మీరు రెడ్ మీట్ తినాలి అనుకుంటే ప్రాసెస్ చేయని ఫ్రెష్ రెడ్ మీట్ వారానికి ఒక్కసారి.. అది కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి.

ఒక్కటే సారి ఆహారాన్ని తీసుకోకూడదు:

అలాగే మొక్కల ఆధారిత గింజలు తినడం వల్ల 30 శాతం తక్కువ ప్రమాదం ఉందని, అలాగే పాల ఉత్పత్తులను ప్రత్యామ్నాయంగా తీసుకోవడం వల్ల 22 శాతం తక్కువ ప్రమాదం ఉందని వెల్లడించారు. ఇలా రోజు వారీ ఆహారంలో చక్కెర తక్కువగా ఉన్న పదార్థాలు, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ అనేవి తగ్గుతాయి. అలాగే షుగర్ వ్యాధితో బాధ పడేవారు ఒక్కటే సారి ఆహారాన్ని తీసుకోకూడదు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారే పెరుగుతాయి. కాబట్టి కొద్ది కొద్దిగా ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేస్తే షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.