Fenugreek Benefits: ఆ సమస్యలకు దివ్య ఔషధం మెంతులు, మెంతికూర.. ప్రమాదకర వ్యాధులకు ఎలా చెక్ పెట్టొచ్చంటే..?

|

Sep 16, 2022 | 4:23 PM

మెంతికూర, మెంతి గింజల గురించి మనందరికీ తెలుసు. మెంతులు చాలా శక్తివంతమైన ఆహారం. ఇది ఒక్కటే అనేక రకాల వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది.

Fenugreek Benefits: ఆ సమస్యలకు దివ్య ఔషధం మెంతులు, మెంతికూర.. ప్రమాదకర వ్యాధులకు ఎలా చెక్ పెట్టొచ్చంటే..?
Fenugreek Benefits
Follow us on

Fenugreek Health Benefits: ప్రస్తుత కాలంలో ప్రజల జీవనశైలి చాలా అధ్వాన్నంగా మారింది. ప్రతి ఇంట్లో రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం లేదా గుండెకు సంబంధించిన ప్రమాదకరమైన వ్యాధుల బాధితులు ఉన్నారు. దీనికి అతి పెద్ద కారణం అనారోగ్యకరమైన ఆహారం, దుర్భర దినచర్య అని నిపుణులు పేర్కొంటున్నారు. పలు అనారోగ్య సమస్యలతోపాటు ప్రజలు ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత రోజుల్లో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల యువతకు ఈ వ్యాధులు వస్తుండటం చాలా ఆందోళన కలిగిస్తోంది. అయితే, దినచర్యను చక్కదిద్దుకోవడం, సరైన ఆహారం, రోజువారీ వ్యాయామం ద్వారా దీనిని నియంత్రించవచ్చని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల షుగర్‌, కొలెస్ట్రాల్‌, రక్తపోటు పెరగడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో మీరు ఈ ప్రయోజనకరమైన కూరగాయలను, గింజలను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు.

మెంతికూర, మెంతి గింజల గురించి మనందరికీ తెలుసు. మెంతులు చాలా శక్తివంతమైన ఆహారం. ఇది ఒక్కటే అనేక రకాల వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే స్టెరాయిడల్ సపోనిన్ అనే పోషకం చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. కాల్షియం, సెలీనియం, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ప్రోటీన్, ఐరన్ తోపాటు పొటాషియం కూడా మెంతికూరలో, గింజలలో పుష్కలంగా లభిస్తుంది. ఆహారంలో పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది. మెంతులు యాంటీఆక్సిడెంట్, స్టెరాయిడ్ సపోనిన్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి కూడా కనిపిస్తాయి. ఇది కళ్ళు, చర్మానికి కూడా మంచిది. డయాబెటిక్ రోగులకు మెంతులు ఆయుర్వేద ఔషధంలా పని చేస్తాయి.

మెంతులు అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉన్నాయి..

ఇవి కూడా చదవండి
  • జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యను తొలగించడం ద్వారా మెంతులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
  • మెంతికూరలో ఉండే పీచు చర్మం పొడిబారడాన్ని పోగొట్టి చర్మ కాంతిని పెంచుతుంది.
  • మెంతులు ఊబకాయం సమస్యను కూడా తగ్గిస్తుంది.
  • మెంతికూరలో లభించే ప్రోటీన్ ఎముకలను బలపరుస్తుంది. ఇంకా ఎముకల జీవక్రియను మెరుగుపరుస్తుంది.
  • జుట్టు రాలిపోయే సమస్యకు మెంతికూర ఔషధంలా పనిచేస్తుంది.
  • విరేచనాలలో పొత్తికడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
  • గుండె సంబంధిత సమస్యలలో ప్రయోజనకరంగా ఉంటుంది.
  • ఏదైనా వాపు సమస్య ఉంటే దాని ఆకులు, గింజలను గ్రైండ్ చేసి తీసుకోండి. దీంతో వెంటనే ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..