Corn Benefits: మొక్కజొన్న లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే.. మధుమేహంతో పాటు ఎన్నో సమస్యలు దూరం..

|

Mar 18, 2022 | 5:37 PM

మొక్కజొన్నకి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతోంది...

Corn Benefits: మొక్కజొన్న లాభాలు తెలిస్తే వావ్ అనాల్సిందే.. మధుమేహంతో పాటు ఎన్నో సమస్యలు దూరం..
Corn
Follow us on

మొక్కజొన్న(Corn)కి మధుమేహాన్ని(Diabetes) నియంత్రించే శక్తి ఉందని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెబుతోంది. ఈ రంగుల కార్న్ తినేవాళ్లలో పొట్ట దగ్గర కొవ్వు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ శాతం తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్‌కు చెందిన పరిశోధకులు వివరించారు. ఊదారంగు కార్న్‌లో ఉండే సంక్లిష్ట ఫైటో కెమికల్స్(Phyto chemicals) మంటని తగ్గించి ఇన్సులిన్ స్రావాన్ని పెంచినట్లు గుర్తించారు. అంతేకాదు.. ఇందుకోసం వీరు అన్ని రంగుల మొక్కజొన్న తీసుకుని వాటిని వర్గాలుగా విభజించిన ఎలుకలకి కొంతకాలం పాటు ఇచ్చారట. అన్ని రకాల మొక్కజొన్నల్లోని ఆంథోసైనిన్ల వల్లా రోగనిరోధకశక్తి పెరిగిందట. క్లోమగ్రంథి పనితీరూ మెరుగైనట్లు గుర్తించారు.

కానీ ఊదారంగు మొక్కజొన్నల్ని తిన్నవాళ్లలో అది మరింత ప్రభావశీలంగా పనిచేయడంతో మధుమేహం పూర్తిగా అదుపులో ఉన్నట్లు తేలింది. దాంతో ఆ రంగు మొక్కజొన్నల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని సదరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

మొక్కజొన్న గింజలు తినటం ఆరోగ్యా నికి ఎంతోమేలు చేస్తుంది. దీనిని సాధార ణంగా జొన్నలని కూడా అంటారు. ఈ మొక్కజొన్న గింజలను వివిధ రకాలుగా వండుతారు. కంకులుగా వున్నప్పుడే వాటిని తినేయవచ్చు. లేదా వాటికి మసాలాలు, కారాలు కూడా తగిలించి తింటారు. గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తినవచ్చు. లేదా ఉల్లిపాయ, పచ్చి మిర్చీ వంటి వాటితో కూడా చేర్చి సాయంకాలం వేళ మంచి చిరుతిండిగా తినేయవచ్చు. మొక్కజొన్నలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ ఇ, బి 1, బి 6, నియాసిన్, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లావిన్.. అనే విటమిన్లు ఎక్కువ ఉంటాయి. మొక్కజొన్న తినటం రుచే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

Read Also.. White Bread: బ్రెడ్‌ మరీ ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..