Immunity Boosters: శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఆహారాలివే.. తిన్నారంటే అన్ని రకాల సమస్యలను దూరంగా పెట్టినట్లే..

|

Sep 20, 2023 | 10:32 AM

Immunity Boosters: తినే ఆహారంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉండేలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ రెండు పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఫలితంగా దగ్గు, జలుబు, జ్వరం, దురద వంటి సీజనల్ వ్యాధుల నుంచి శరీరం తనను తాను రక్షించుకోగలుగుతుంది. ఫలితంగా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. అయితే రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు..

Immunity Boosters: శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ఆహారాలివే.. తిన్నారంటే అన్ని రకాల సమస్యలను దూరంగా పెట్టినట్లే..
Immunity Boosters
Follow us on

Immunity Boosters: ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావల్సిన పోషకాలు ఆహారం ద్వారా అందితే ఎలాంటి సమస్యలు దరిచేరవు. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉన్నందున శరీరంలో పోషకాహార లోపం ఏర్పడదు, ఫలితంగా ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే తినే ఆహారంలో ఏవి ఉన్నా లేకున్నా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉండేలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ రెండు పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఫలితంగా దగ్గు, జలుబు, జ్వరం, దురద వంటి సీజనల్ వ్యాధుల నుంచి శరీరం తనను తాను రక్షించుకోగలుగుతుంది. ఫలితంగా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. అయితే రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు ఏయే ఆహారాలు తీసుకోవాలో తెలుసా..? ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మసాలా దినుసులు: భారతీయ వంట గదిలో ఉండే పసుపు, జీలకర్ర, మెంతులు, అవాలు, ఎలకులు, వాము, కొత్తిమీర, ఎండు మిర్చి వంటి ఇతర సుగంధ ద్రవ్యాలు రుచిని పెంచడంలోనే కాక ఆరోగ్యాన్ని కూడా కాపాడడంలో కూడా ఉపకరిస్తాయి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ వంటి పలు లక్షణాలు పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు.

పచ్చి మిర్చి: పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఉసిరి: విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల కోసం ఉసిరి ఒక సూపర్ ఫుడ్. ఉసిరిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి బలోపేతం కావడమే కాక చర్మ, కేశ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

సిట్రస్ పండ్లు: నారింజ, విటమిన్ వంటి సిట్రస్ పండ్లు విటమిన్ సికి మంచి వనరులని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంటీ ఆక్సిడెంట్లకు కూడా నిలయమైన ఈ పండ్లు  రోగ నిరోధక శక్తని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

విత్తనాలు, గింజలు: బాదం, జీడి పప్పు, పిస్తా, వాల్నట్స్, పుచ్చకాయ గింజలు, గుమ్మడి కాయ విత్తనాలు వంటి పలు రకాల గింజలు, విత్తనాలు కూడా ఆరోగ్యాన్ని  కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పలు రకాల విటమిన్లు, మినరల్స్,  ఫైబర్, ప్రోటీన్ కలిగినందున ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)