చిన్నగా ఉన్నాయ్.. ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. రాత్రి భోజనం చేసిన తర్వాత చిటికెడు తింటే..

జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఐరన్, రాగి, కాల్షియం, జింక్, పొటాషియం వంటి అనేక పోషకాలు జీలకర్రలో లభిస్తాయి. కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను నయం చేయడంలో జీలకర్ర, జీలకర్ర నీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తక్కువ అయ్యేలా చేస్తుంది.. కొలెస్ట్రాల్ బాధితులకు జీలకర్ర వరం కంటే తక్కువ కాదు.

చిన్నగా ఉన్నాయ్.. ఇవేం చేస్తాయిలే అనుకునేరు.. రాత్రి భోజనం చేసిన తర్వాత చిటికెడు తింటే..
Cumin Benefits

Updated on: May 06, 2024 | 1:57 PM

జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఐరన్, రాగి, కాల్షియం, జింక్, పొటాషియం వంటి అనేక పోషకాలు జీలకర్రలో లభిస్తాయి. కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను నయం చేయడంలో జీలకర్ర, జీలకర్ర నీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తక్కువ అయ్యేలా చేస్తుంది.. కొలెస్ట్రాల్ బాధితులకు జీలకర్ర వరం కంటే తక్కువ కాదు. కొలెస్ట్రాల్‌ను కరిగించేలా చేయడంతోపాటు.. బరువు తగ్గడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది హృదయ సంబంధ వ్యాధులను నివారించడమే కాకుండా, హానికరమైన రక్త ట్రైగ్లిజరైడ్‌లను కూడా తగ్గిస్తుంది. అందుకే.. రాత్రి భోజనం చేసిన తర్వాత కొంచెం (ఆఫ్ స్పూన్) జీలకర్రను నమిలితింటే చాలా మంచిదని ఆయూర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, ఉదయం వేళ కానీ.. సాయంత్రం కానీ.. జీలకర్ర నీటిని తాగడం మంచిదంటున్నారు. గ్లాసు నీటిలో మరిగించి తాగాలి.. జీలకర్ర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకోండి..

జీలకర్ర నీరు బరువు తగ్గడంలో సహకరిస్తుంది

మీరు బరువు తగ్గాలనుకుంటే, జీలకర్ర గింజలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. జీలకర్ర నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. క్రమంగా కొలెస్ట్రాల్ సమస్య కూడా దూరమవుతుంది.

జీర్ణక్రియ..

జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచేందుకు జీలకర్రను హెర్బ్‌గా ఉపయోగిస్తారు. ఇది అజీర్ణం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

వాపు నిరోధకం..

జీలకర్రలో విటమిన్-ఎ, విటమిన్-సి, కాపర్, మాంగనీస్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మంట నుంచి శరీరాన్ని రక్షించడమే కాకుండా శరీర నిర్విషీకరణకు సహాయపడుతుంది.

నిద్రలేమికి చికిత్స..

జీలకర్రలోని గుణాలు నిద్ర సమస్యను దూరం చేయడంలో సహాయపడతాయి. ఒత్తిడి లక్షణాలను సులభంగా తగ్గించవచ్చు. జీలకర్ర నీటిలో మెలటోనిన్ కూడా ఉంటుంది, ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..