Beauty Tips: ఇడ్లీ పిండితో అందాన్ని పెంచుకోవచ్చట.. ఎలానో తెలుసుకోవాలని ఉందా..

అందం కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మొఖం మెరవాలని రకరకాల క్రీమ్ లు వాడుతుంటారు.

Beauty Tips: ఇడ్లీ పిండితో అందాన్ని పెంచుకోవచ్చట.. ఎలానో తెలుసుకోవాలని ఉందా..
Face Pack

Edited By: Anil kumar poka

Updated on: Feb 04, 2022 | 8:35 AM

Beauty Tips: అందం కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మొఖం మెరవాలని రకరకాల క్రీమ్ లు వాడుతుంటారు. అయితే మార్కెట్‌లో దొరికే ప్రోడక్ట్స్‌కి బదులుగా మన ఇంట్లో ఉండే పదార్ధాలు వాడినా కూడా అందాన్ని పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. నిత్యం మనకు దొరికే పదార్ధాలను వాడి అందం పెంచుకోవచ్చట.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అరటి పండు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుందట. అరటిపండ్లు, కొంచెం తేనె,  ½ టీస్పూన్ బియ్యం పిండి లేదా శెనగ పిండిని  బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.. ఆతర్వాత చక్కగా వాష్ చేయండి. దాంతో మొఖం మెరిసిపోతుంది. అలాగే పెరుగు ఇంకా శెనగ పిండి ఫేస్‌ప్యాక్.. ఇందుకోసం పెరుగు 1 టీస్పూన్, శనగ పిండి 1/4 టీస్పూన్, చిటికెడు పసుపు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి..ఆతర్వాత  10 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో వాష్ చేయాలి. ఇంకా ఓట్స్ పిండి,  పాలు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి ఆతర్వాత సెమీ డ్రై అయినప్పుడు వాష్ చేయండి. అదేవిధంగా హోల్‌వీట్ ఇంకా పాల ఫేస్‌ప్యాక్  గోధుమ పిండి 1 టీస్పూన్, పాలు/బాదం పాలు పేస్ట్‌లా బాగా కలపాలి అనంతరం ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆతర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేయండి. ఇవే కాదు ఇడ్లీ పిండి ఫేస్‌ప్యాక్ తో కూడా అందాన్ని పెంచుకోవచ్చట. దోసె లేదా ఇడ్లీ పిండి తీసుకోవాలి, చిటికెడు పసుపు పొడి కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి ఆతర్వాత  వాష్ చేయండి. ఇలా ఇన్ని రకాలుగా మనం అందాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

FIR Trailer: అమాయకుడి జీవితాన్ని తలకిందులు చేసిన అనుమానం.. ఆసక్తికరంగా ఎఫ్‌ఐఆర్‌ ట్రైలర్‌..

Childhood Pic:ఈ ఫోటో ఆ పాత మధురం.. అమ్మగా, బామ్మగా సిని ప్రేక్షకులకు సుపరిచితం.. ఎవరో గుర్తు పట్టరా..

Vaishnav Tej: మెగా హీరో సినిమా నుంచి మరో అప్డేట్‌.. అలరిస్తోన్న రంగ రంగ వైభవంగా మెలోడీ సాంగ్‌..