Kidney Health
శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. దాని సహాయంతో మాత్రమే శరీరంలో నిండిన వ్యర్థాలు బయటకు వస్తాయి. మూత్రపిండాలు.. రక్తాన్ని ఫిల్టర్ చేయడం వంటి ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. అటువంటి పరిస్థితిలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు చర్యలు తీసుకోవటం చాలా ముఖ్యం… ఎప్పుడైనా మూత్రపిండాలలో (కిడ్నీ) ఏదైనా సమస్య ఉంటే, దానిని గుర్తించడం, వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు వైద్య నిపుణులు.. దీర్ఘకాలం పాటు కిడ్నీ సమస్యను విస్మరించడం.. మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది.
చాలా సార్లు కిడ్నీ సమస్యలు ఉదయాన్నే ఎక్కువగా కనిపిస్తాయి. మూత్రపిండాల వైఫల్యానికి సంబందించి ఉదయాన్నే కనిపించే 5 లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకోండి..
- ఉదయం వేళ నిద్రలేవగానే అలసట – బలహీనత: మీరు ఉదయం మేల్కొన్నప్పుడు అలసిపోయినట్లు లేదా బలహీనంగా ఉన్నట్లయితే, ఇది తీవ్రమైన సంకేతం కావచ్చు. కిడ్నీ సమస్యల కారణంగా శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా మీరు ఎల్లప్పుడూ ఉదయం నిద్రలేచిన తర్వాత అలసిపోయినట్లు అనిపించవచ్చు.
- మూత్రవిసర్జనలో మార్పులు: ఉదయపు మూత్రం రంగు – పరిమాణం మీ మూత్రపిండాల ఆరోగ్యానికి ముఖ్యమైన సూచిక. మీ మూత్రం చాలా పసుపు, నురుగు లేదా అసాధారణ రంగులో ఉన్నట్లయితే లేదా మీరు తరచుగా మూత్ర విసర్జన చేయవలసి వస్తే అది మూత్రపిండాల సమస్యలకు సంకేతం కావచ్చు.
- కడుపు తిమ్మిరి: మీరు ఉదయం నిద్రలేవగానే కడుపులో వాపు లేదా తిమ్మిరిని అనుభవిస్తే, అది మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడానికి సంకేతం కావచ్చు.
- చాలా దాహం వేయడం: మీరు పొద్దున లేచినప్పుడు తరచుగా దాహం వేస్తూ ఉంటే, ఇది మరొక సంకేతం కావచ్చు. కిడ్నీ సమస్యల కారణంగా, శరీరంలో నీటి సమతుల్యత కొరవడుతుంది.. దీని కారణంగా మీరు మరింత దాహంగా ఉంటారు.
- దురద – చర్మ సమస్యలు: కిడ్నీ సమస్యల కారణంగా, శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది చర్మంపై దురద, దద్దుర్లు లేదా ఇతర సమస్యలను కలిగిస్తుంది. మీరు ఉదయం నిద్రలేవగానే చర్మంలో అసాధారణమైన దురదను ఎదుర్కొంటుంటే, దానిని అస్సలు విస్మరించకండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి