Drinking Water: వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..

|

Mar 30, 2022 | 10:50 PM

Summer Health Tips: వేసవి ఎండలు మండిపోతున్నాయి. మార్చి కూడా ముగియకముందే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. దీంతో చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకుపోతుంది.

Drinking Water: వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..
Drinking Water
Follow us on

Summer Health Tips: వేసవి ఎండలు మండిపోతున్నాయి. మార్చి కూడా ముగియకముందే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. దీంతో చెమట రూపంలో నీరు ఎక్కువగా బయటకుపోతుంది. ఈక్రమంలో బాడీ డీహైడ్రేషన్‌ (Dehydration) కు గురికాకుండా అదే పనిగా నీళ్లు, పళ్ల రసాలు తీసుకుంటారు చాలామంది. దీనివల్ల శరీరంలో నీటిస్థాయులు (Water Levels) పెరిగి రోజంతా ఉత్సాహవంతంగా పనిచేస్తారని వారి అభిప్రాయం. అయితే వేసవిలో అదే పనిగా నీళ్లు తాగడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మోతాదుకు మించి నీళ్లు తాగడం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు (Kidney Issues) తలెత్తవచ్చంటున్నారు.

కిడ్నీలకు కీడు తప్పదు..

కాగా ఈ విషయంపై ఇండియన్ స్పైనల్ ఇంజూరీస్ సెంటర్ హెడ్, కన్సల్టెంట్ అండ్‌ జనరల్ యూరాలజిస్ట్‌ డాక్టర్ వినీత్ నారంగ్ News 9 మాట్లాడారు. వేసవిలో అదే పనిగా నీళ్లు తాగడం వల్ల శరీరానికి ముఖ్యంగా మూత్రపిండాలకు మంచిది కాదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు మోతాదుకు మించి నీటిని తాగడం వల్ల విసర్జన వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడతుందని, దీనివల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయంటున్నారు. ‘సమ్మర్‌లో ఎక్కువగా నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ల స్థాయుల్లో సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల చికాకు నుంచి ప్రాణహాని వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు ఆ నీటిని వదిలించుకోలేవు. ఫలితంగా రక్తంలో సోడియం స్థాయులు తగ్గిపోతాయి. దీనివల్ల డైల్యూషనల్ హైపోనాట్రేమియా (రక్తంలో సోడియం స్థాయులు తగ్గడం) సమస్య తలెత్తుతుంది. ఇది ఒక్కోసారి ప్రాణాపాయానికి దారి తీస్తుంది కూడా.’

ప్రాణాపాయం కూడా..

‘సోడియం ఓవర్‌హైడ్రేషన్ ద్వారా ఎక్కువగా ప్రభావితమయ్యే ఎలక్ట్రోలైట్. ఇది కణాల లోపల, వెలుపల ద్రవాల స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. శరీరంలో నీటిస్థాయలు అధికమై, సోడియం తగ్గినప్పుడు ద్రవాలు కణాలలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా కణాలు ఉబ్బిపోయి మూర్ఛ రావడం, కోమాలోకి వెళ్లడం, ఒక్కోసారి చనిపోవడం వంటివి కూడా జరుగుతుంటాయి. ఓవర్‌ హైడ్రేషన్‌ మెదడుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. మెదడులోని కణాలు ఉబ్బిపోయి ఒకరకమైన ఒత్తిడి, ఆందోళన, తలనొప్పిని కలిగిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు) , బ్రాడీకార్డియా (తక్కువ హృదయ స్పందన రేటు) వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తాయి. ఇక ఓవర్‌హైడ్రేషన్‌ కారణంగా కొందరిలో మూత్రాశయం పనితీరు దెబ్బతింటుంది. వృద్ధులు, కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి ఇది ప్రాణాంతకం కావొచ్చు. వీరు కేవలం 2.5 – 3 లీటర్ల నీళ్లు మాత్రమే తాగాలి’ అని సూచించారు డాక్టర్ వినీత్.

ఓవర్‌ హైడ్రేషన్‌ సంకేతాలు ఏంటంటే..

మూత్రం రంగు

మూత్రం తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉన్నట్లయితే మీరు సరైన స్థాయుల్లోనే నీటిని తాగుతున్నట్లు లెక్క. అయితే మూత్రం ముదురు పసుపు (Dark Yellow) రంగులో ఉండి, వాసన వస్తుంటే మాత్రం మరిన్ని ఎక్కువగా నీళ్లు తాగాలి..

వికారం లేదా వాంతులు

ఒక్కోసారి ఓవర్‌హైడ్రేషన్ లక్షణాలు కూడా డీహైడ్రేషన్‌కు దారి తీస్తాయి. శరీరంలో ఎక్కువగా నీళ్లు ఉన్నప్పుడు.. మూత్రపిండాలు ఆ అదనపు ద్రవాలను వదిలించుకోలేవు. ఫలితంగా వికారం, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.

కండరాల బలహీనత

మోతాదుకు మించి నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ స్థాయులు పడిపోతాయి. ఫలితంగా కండరాల నొప్పులతో పాటు తిమ్మిర్లు కలుగుతాయి.

అలసట, నీరసం

ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాలపై అదనపు భారం పడుతుంది. ఇది శరీరంలో హర్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన, అలసట లాంటి సమస్యలు తలెత్తుతాయి.

నీళ్లెలా తీసుకోవాలంటే..

శరీరానికి ఎంత నీరు అవసరమనేది మన శారీరక శ్రమ, వాతావరణం, శరీర బరువు తదితర విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం19 నుంచి 30 ఏళ్ల వయస్సు గల మహిళలు రోజుకు 2.7 లీటర్ల నీరు తీసుకోవాలి. అదే వయస్సు గల పురుషులు 3.7 లీటర్లు అవసరమని సూచిస్తున్నారు. ఇక క్రీడాకారులు, వృద్ధులు, గర్భిణీలు డాక్టర్ల సలహాలు, సూచనల ప్రకారం నీటిని తీసుకోవాలి. ‘వేసవిలో బాడీ డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అదే సమయంలో నీటిని తీసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బాడీని హైడ్రెటెడ్‌గా ఉంచుకోవడానికి రోజు కనీసం 8 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి’ అని డాక్టర్‌ డాక్టర్ వినీత్ నారంగ్‌ సూచిస్తున్నారు.

Also Read:Combat Helicopter: మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్మీకి 15 లైట్ కంబాట్ హెలికాప్టర్లు.. ధర ఎంతో తెలుసా?

IPL 2022: ఈ సీజన్‌లో సున్నాకే పెవిలియన్ చేరిన 8మంది బ్యాట్స్‌మెన్స్.. లిస్టులో రూ. 17 కోట్ల ఆటగాడు..

4 టన్నుల డైనమైట్‌.. 40 అంతస్తులు.. 9 సెకెన్లలో ఢాం..నేలపై కుషన్లు.! వీడియో చుస్తే మతి పోవాల్సిందే..