పాలు (ఆవు లేదా బర్రె పాలు) త్రాగడం మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శతాబ్దాలుగా ఇది పోషకమైన ఆహారంగా పరిగణించి.. వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పాలలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. పాలు తాగడం వల్ల విటమిన్ డి, క్యాల్షియం, ప్రొటీన్లు అందుతాయి. ఇది మన శరీరాన్ని, ఎముకలను బలపరుస్తుంది. అందుకే పెద్దల నుంచి వైద్యులు వరకు అందరూ కూడా పాలు తాగాలని సూచిస్తున్నారు. అందుకే.. పిల్లలు, పెద్దలు ఉదయం, సాయంత్రం వేళల్లో ఓ పెద్ద గ్లాసులో పాలు తాగడం అనేది సాధారణంగా మారింది. అయితే, ఎక్కువ పాలు తీసుకోవడం కూడా మంచిదేనా…? తీసుకుంటే ఏమవుతుంది..? అనే సందేహాలు తరచూ కలుగుతుంటాయి. పాలు ఎక్కువ తాగితే ఏమవుతుందో తెలుసుకోండి..
అయితే, పాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరగదని.. చాలా హానికరం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఏదైనా మితంగా తీసుకుంటేనే మంచిదని.. లేకపోతే ప్రమాదకరమని పేర్కొంటున్నారు. పాలను ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందో చూడండి..
ప్రతిరోజూ ఎక్కువ పాలు తాగడం వల్ల మీ శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. పాలలో చాలా కొవ్వు, కేలరీలు ఉంటాయి. ఇది మీరు వేగంగా బరువు పెరిగేలా చేస్తుంది. 1 కప్పు పాలలో 5 గ్రాముల కొవ్వు, 152 కేలరీలు ఉంటాయి. ఇది పెద్ద మొత్తంలో లాక్టోస్, సహజ చక్కెరను కలిగి ఉంటుంది. దీని వల్ల మీ బరువు పెరగడమే కాకుండా అనేక ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు.
ఎక్కువ పాలు తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలను అనుభవించే ముందు మనం రోజుకు ఎంత పాలు తీసుకోవాలి? తెలుసుకోవడం మంచిది.
ఒక వ్యక్తి పాలు త్రాగే సామర్థ్యం వారి శారీరక స్థితి, వయస్సును బట్టి మారవచ్చు.
3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు – 300 నుంచి 500 ml పాలు
4 నుంచి 10 సంవత్సరాల వయస్సుగల వారు- 400 నుంచి 600 ml పాలు
11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు – 500 ml నుంచి 700 ml పాలు
18 ఏళ్లు పైబడిన వారు – 1 లేదా 2 గ్లాసుల పాలు
పాలు ఎక్కువగా తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి?:
కడుపు సంబంధిత సమస్యలు: ప్రతిరోజూ పాలు తాగే వారికి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ఉదాహరణకు, గ్యాస్ట్రిక్, డయేరియా లేదా మలబద్ధకం లాంటివి.. ఎక్కువ పాలు తాగడం వల్ల మంచి, చెడు బ్యాక్టీరియా మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది ఈ సమస్యలకు దారితీస్తుంది.
జీర్ణ సమస్యలు: పాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రజలు జీర్ణ సమస్యలను ఎదుర్కొంటారు. ఇందులో ఉండే లాక్టోస్ వల్ల మనుషుల జీర్ణశక్తి దెబ్బతింటుంది. పేలవమైన జీర్ణక్రియ వాంతులు, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలను కలిగిస్తుంది.
చర్మ సమస్యలు: మీకు మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి చర్మ సంబంధిత సమస్యలు ఉంటే, మీరు ఎక్కువ పాలు తీసుకోకూడదు.. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పాలు తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు. పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అలర్జీ సమస్యలు వస్తాయి. దీని కారణంగా, శరీరంలోని వివిధ భాగాలలో మొటిమలు, దద్దుర్లు కనిపిస్తాయి.
కాలేయ సంబంధిత సమస్యలు: మీకు కాలేయ సంబంధిత సమస్యలు లేదా వ్యాధులు ఉన్నట్లయితే మీరు పాలు తీసుకోకూడదు. పాలలో కొవ్వు పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల కాలేయం పాలను సరిగా జీర్ణం చేసుకోలేకపోతుంది. దీని వల్ల కాలేయం ఉబ్బిపోతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..