Health Tips: కివీ ఫ్రూట్‌ని సరైన పద్దతిలో తింటే రెట్టింపు లాభాలు..!

| Edited By: Anil kumar poka

Apr 24, 2022 | 8:09 AM

Health Tips: కివీ పండు కొంచెం పుల్లగా, కొంచెం తీయగా ఉంటుంది. దీనిని జ్యూస్, ఫ్రూట్ సలాడ్‌లో ఎక్కువగా వాడుతారు. ఈ పండు

Health Tips: కివీ ఫ్రూట్‌ని సరైన పద్దతిలో తింటే రెట్టింపు లాభాలు..!
Kiwi Fruit
Follow us on

Health Tips: కివీ పండు కొంచెం పుల్లగా, కొంచెం తీయగా ఉంటుంది. దీనిని జ్యూస్, ఫ్రూట్ సలాడ్‌లో ఎక్కువగా వాడుతారు. ఈ పండు చాలా ఆరోగ్యకరమైనది. ముఖ్యంగా డీహైడ్రేషన్, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో పాటు శారీరక బలహీనతను తొలగించడంలో కూడా ఈ పండు ఉపయోగకరంగా ఉంటుంది. కరోనా ఇన్ఫెక్షన్ సమయంలో కివి తింటే చాలా మంచిది. ఇందులో విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. మీరు నారింజ, సీజనల్, నిమ్మకాయ మొదలైన వాటిని తినడం విసుగు చెందితే కివీని ట్రై చేయవచ్చు. రోజూ కివీ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే దీనిని ఎలా తినాలో తెలుసుకుందాం.

కివీ పండు ఇతర పండ్లలాగా ఆకర్షణీయంగా కనిపించదు. దీని పైభాగం గోధుమ రంగులో ఉంటుంది. కివీ తొక్క ఆరోగ్యకరమైనది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మీ పొట్టను శుభ్రంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌కు సంబంధించిన సమస్య ఉంటే మీరు తప్పనిసరిగా కివీని తొక్కతో తినాలి. కివీని కోసేటప్పుడు పొట్టుతో గుండ్రని ముక్కలుగా కట్ చేసి తింటే బాగుంటుంది. రుచిలో కూడా ఎటువంటి మార్పు ఉండదు.

వాస్తవానికి కివీ ధర యాపిల్‌ పండ్లతో సమానంగా ఉంటుంది. మన దేశంలో కివి సాగు అంతపెద్దగా ఉండదు కానీ వీటిని ఎక్కువగా చల్లని ప్రదేశాల్లో సాగుచేస్తారు. న్యూజిలాండ్‌లో వీటిని ఎక్కువగా పండిస్తారు. అందుకే న్యూజిలాండ్‌ జట్టుని ‘కివీస్’ అంటారు. ఇందులో ఉన్న పోషకాలు, విటమిన్లు మరే పండులోఉండవని చెబుతారు శాస్త్రవేత్తలు. కివీ ఫ్రూట్‌లో కొవ్వు, సల్ఫర్ తక్కువగా ఉంటుంది. అందుకే గుండె, మధుమేహ వ్యాధిగ్రస్థులు తినవచ్చు. బరువు తగ్గించుకోవాలనుకొనేవారు కివి తింటే ఫలితం కనిపిస్తుంది. కివి తిన్నవారిలో శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన బెంగుళూరు.. సునాయసనంగా గెలిచిన హైదరాబాద్..

NEP 2020: ఆ రాష్ట్రంలో ఇక ఎంఫిల్‌ చదువులకి స్వస్తి.. బీఈడీ కోర్సు నాలుగు సంవత్సరాలు..!

CRIS Recruitment 2022: నిరుద్యోగులకి శుభవార్త.. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ నుంచి నోటిఫికేషన్..