Obesity: అలర్ట్.. ఊబకాయం నేరుగా డిమెన్షియాకు కారణమవుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

May 11, 2024 | 7:29 PM

ఇటీవలి కాలంలో ఊబకాయం సమస్య పెను ప్రమాదంగా మారుతోంది.. ముఖ్యంగా అన్నిరోగాలకు ప్రధాన కారణం ఊబకాయమేనని చెబుతుండటంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది వ్యాయామాలు, డైటింగ్ లు చేస్తున్నారు.. ఇలాంటి సమయంలో ఊబకాయం- చిత్తవైకల్యం (డిమెన్షియా) మధ్య లింక్ గురించి చర్చలు జరుగుతున్నాయి.

Obesity: అలర్ట్.. ఊబకాయం నేరుగా డిమెన్షియాకు కారణమవుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Obesity Dementia
Follow us on

ఇటీవలి కాలంలో ఊబకాయం సమస్య పెను ప్రమాదంగా మారుతోంది.. ముఖ్యంగా అన్నిరోగాలకు ప్రధాన కారణం ఊబకాయమేనని చెబుతుండటంతో ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది వ్యాయామాలు, డైటింగ్ లు చేస్తున్నారు.. ఇలాంటి సమయంలో ఊబకాయం- చిత్తవైకల్యం (డిమెన్షియా) మధ్య లింక్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఊబకాయం చిత్తవైకల్యం ప్రమాదాన్ని పెంచుతుందని అనేక వార్తా నివేదికలలో పేర్కొంటున్నారు. అయితే ఇది నిజంగా అలా ఉందా? అంటే.. ఇటీవలి పరిశోధన ఫలితాలు ఈ లింక్‌ను ఇంకా పూర్తిగా నిరూపించలేకపోయాయి. అయినప్పటికీ, కొన్ని అధ్యయనాలు మాత్రం ఊబకాయం, చిత్తవైకల్యం ప్రమాద కారకాల మధ్య సారూప్యతను కనుగొన్నాయి.

ఊబకాయం- టైప్ 2 డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తరచుగా కలిసి ఉంటాయి. ఈ కారకాలన్నీ మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చిత్తవైకల్యం ప్రమాదాన్ని పెంచుతాయి. కానీ ఊబకాయం నేరుగా చిత్తవైకల్యానికి కారణమవుతుందని దీని అర్థం కాదు. ఈ కారకాలన్నీ సంక్లిష్టమైన ప్రయాణంలో భాగమై చివరికి చిత్తవైకల్యానికి దారితీసే అవకాశం ఉంది.

ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి?

ప్రస్తుతానికి, ఊబకాయం నేరుగా డిమెన్షియాకు కారణమవుతుందని చెప్పడం కష్టం. అయినప్పటికీ, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం.. ఇంకా చిత్తవైకల్యం కోసం ఇతర ప్రమాద కారకాలను నియంత్రించడం మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని విషయాలను తెలుసుకోండి..

  • పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి.
  • శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  • ధూమపానం మెదడు ఆరోగ్యానికి హానికరం.. చిత్తవైకల్యం ప్రమాదాన్ని పెంచుతుంది. కావున ధూమపానాన్ని మానేయండి..
  • ఒత్తిడి, డిప్రెషన్ డిమెన్షియాకు ప్రమాద కారకాలు కావచ్చు. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.

మనం చిత్తవైకల్యం (డిమెన్షియా) ఒక ప్రమాదకరమైన వ్యాధి అని గుర్తుంచుకోవాలి.. దీనికి అనేక కారణాలు అనేకం ఉండవచ్చు. ఊబకాయం చిత్తవైకల్యంతో ఎలా ముడిపడి ఉందో అర్థం చేసుకోవడానికి మరింత పరిశోధన అవసరం. అయినప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం చిత్తవైకల్యం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..