Copper Bowls: వేసవి కాలంలో మనల్ని అనేక సమస్యలు వేధిస్తాయి. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడు వేడిగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణ సమస్యలు పెరుగుతాయి. ఈ సమయంలో మనం ఆహారం, పానీయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరాన్ని చల్లగా ఉంచడానికి ప్రయత్నించాలి. అయితే వేసవిలో రాగి పాత్రలలో తినడం, తాగడం చేయకూడదు. వేసవిలో రాగి పాత్రల్లో తినడం తాగడం సరికాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రాగిపాత్రలో ఉంచిన నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క నీరు విషయంలో మినహాయించి ఎండాకాలం వీటిని ఉపయోగించకూడదు. రాగి పాత్రల్లో వంట చేయడం చాలా చెడ్డది. దీనివల్ల ఆహారంలో కాపర్ పరిమాణం పెరిగి శరీరంలో అనేక దుష్ప్రభావాలకు కారణమవుతుంది. రక్తస్రావం, ఆకలి వేయకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, విరేచనాలు, ఉబ్బరం మొదలైన సమస్యలు ఏర్పడుతాయి. వేసవిలో పాలు, పుల్లని పదార్థాల నిల్వ కోసం రాగి పాత్రలని అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే అవి ఆమ్ల ప్రతిచర్యను కలిగిస్తాయి. కొన్నిసార్లు పాలు పగిలి పుల్లని వస్తువులను పాడు చేస్తుంది. ఇది మీ శరీరానికి కూడా హాని చేస్తుంది. వాంతులు అవడం, అతిసారం, ఉబ్బరం మొదలైన సమస్యలు తలెత్తతాయి.
వేసవిలో పిల్లల కోసం రాగి పాత్రల్లో వండటం, రాగి పాత్రల్లో తినడం రెండూ సురక్షితం కాదు. దీనివల్ల పిల్లలు రోజంతా చురుకుగా ఉండలేరు, కళ్లు తిరిగి పడిపోయే సమస్యలుంటాయి. పిల్లలను రాగి పాత్రలకు దూరంగా ఉంచడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రాగి ప్రభావం వేడిగా ఉంటుంది. ఈ పరిస్థితిలో వేసవి రోజులలో ఇది మరింత ప్రభావం చూపుతుంది. కానీ తాగునీటికి సంబంధించినంతవరకు ఎటువంటి సమస్య ఉండదు. కానీ ప్రతిసారి రాగి గ్లాసులో నీరు తాగవద్దు. రాత్రిపూట రాగి గ్లాసులో నీళ్లు ఉంచి ఉదయం పూట తాగితే ఫర్వాలేదు. కానీ పదే పదే రాగి వస్తువులని ఉపయోగించకూడదు.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి