
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక చెంచా దేశీ నెయ్యి తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది చెబుతున్నారు. సెలబ్రెటీలే కాదు.. సామాన్యులు సైతం ఈ విషయాన్ని తెగ ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు నెట్టింట చెబుతున్నట్లు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తింటే మంచిదేనా ? అనే సందేహాలు చాలా మందికి కలుగుతున్నాయి. ఇప్పుడు పాపులర్ అవుతున్న ఈ నెయ్యి ట్రెండ్ ఆరోగ్యానికి మేలు చేస్తుందా..? అనే విషయాలను తెలుసుకుందాం.. నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పురాతన కాలం నుంచి పెద్దలు చెబుతున్నారు. పూర్వకాలంలో ఆహారాన్ని నెయ్యితో మాత్రమే వండేవారు. దానివల్ల ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉండేవారని.. అప్పట్లో ఏలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని అంటారు. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధి పోరాట T- కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. అందువల్ల దీని వినియోగం శరీరం వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. పోషకాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఇది కడుపు, జీర్ణక్రియను బలపరుస్తుంది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. నెయ్యి తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యంగా ఉండేందుకు సహయపడుతుంది. పూర్వకాలంలో మన పూర్వీకులు ప్రతి భోజనానికి ముందు ఒక చెంచా నెయ్యి తినేవారు. ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు అల్సర్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..