Jaggery And Chana Benefits: మీ జ్ఞాపక శక్తికి పదును పెట్టాలంటే బెల్లం, శనగలు కలిపి తినాల్సిందే.. వాటితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

బెల్లంలో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. శనగల్లో కాల్షియం, విటమిన్లు,ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి మీ శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయో తెలుస్తే మీరు షాక్ అవుతారు. వెంటనే వీటిని మీ డైట్‎లో చేర్చుకుంటారు.

Jaggery And Chana Benefits: మీ జ్ఞాపక శక్తికి పదును పెట్టాలంటే బెల్లం, శనగలు కలిపి తినాల్సిందే.. వాటితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Jaggary And Chana

Edited By: Janardhan Veluru

Updated on: Feb 17, 2023 | 3:27 PM

Jaggery And Chana Health Benefits: మన శరీరం శక్తివంతంగా ఉండాలంటే ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్, మినరల్స్ కూడిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవన్నీ కూడా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే బెల్లం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శెనగలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.శనగల్లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, వంటి పోషకాలు ఉన్నాయి. బెల్లంలో ఐరన్, మెగ్నీషియం లభిస్తాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకునట్లయితే..మీరు ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. శనగలు, బెల్లం కలిపి తినడం వల్ల కలిగే 5 ప్రయోజనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం, శనగలు కలిపి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

జీవక్రియను పెంచడంలో :

ప్రతిరోజూ ఉదయం శనగలు, బెల్లం కలిపి తిన్నట్లయితే కండరాలు దృఢంగా ఉంటాయి. ప్రతిరోజూ వ్యాయాయం చేసే వారు, జిమ్ కు వెళ్లేవారు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గుతారు:

నేటి కాలంలో చాలా మంది అధికబరువు , ఊబకాయంతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారికి శనగలు, బెల్లం దివ్యౌషధం లాంటివి. వీటిని ప్రతిరోజూ డైట్ లో తీసుకున్నట్లయితే బరువు తగ్గుతారు. ప్రతిరోజూ 100గ్రాముల శనగలను ఆహారంలో తీసుకుంటే శరీరానికి 19 గ్రాముల ప్రొటీన్ అందుతుంది.

ఎసిడిటిని దూరం చేస్తుంది:

చాలామందిలో ఎసిడిటి సమస్య ఉంటుంది. ఎసిడిటి సమస్యను తగ్గించాలంటే బెల్లం, శనగలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి మీ జీర్ణశక్తిని బలంగా ఉంచుతాయి. శనగల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ సూపర్ ఫుడ్ డైజెస్టివ్ ఎంజైమ్‎లను యాక్టివేట్ చేస్తాయి.

జ్ఞాపకశక్తి పెరుగుతుంది:

వీటిని తరచుగా ఆహారంలో చేర్చుకున్నట్లయితే జ్ఞాపకశక్తికి పెరుగుతుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ అనే హార్మోన్ ను ప్రోత్సహిస్తుంది. దీంతో మీ మెదడు పనితీరు బాగా మెరగవుతుంది. అంతేకాదు ఒత్తిడి కూడా తగ్గుతుంది.

దృఢమైన దంతాల కోసం:

శనగలు , బెల్లం కలిపి తింటే ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. వీటిలో ఉండే భాస్వరం దంతాలను బలపరుస్తుంది. 10 గ్రాముల బెల్లం 4 మిల్లీగ్రాముల భాస్వరం, 100గ్రాములకు 168 మిల్లీగ్రాముల లభిస్తుంది.

గుండె జబ్బులను నయం చేస్తాయి:

గుండె సంబంధిత జబ్బులను నయం చేయడంలో శనగలు, బెల్లం ఎంతగానో మేలు చేస్తాయి. అధికరక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. శనగల్లో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

రక్తహీనత దూరమవుతుంది:

శరీరంలో రక్తం లేకపోవడంతో (రక్తహీనత) బాధపడుతుంటే శెనగలు, బెల్లం కలిపి తినవచ్చు. ఎందుకంటే ఈ రెండూ ఐరన్‌కు మంచి మూలాలు. దీని కారణంగా రక్తంలో ఆక్సిజన్, ఎర్ర రక్త కణాలను పెరుగుతాయి. ఇది శరీరంలో రక్తహీనతను దూరం చేస్తుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..