చలికాలంలో మీరు తీసుకునే ఆహారంలో ఈ మార్పులు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు.. ఇవి రోజూ తింటే ఎంతో లాభం..

|

Jan 11, 2023 | 4:50 AM

శీతాకాలంలో ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పుల ఆధారంగా ఆహారంలో మార్పులు..

చలికాలంలో మీరు తీసుకునే ఆహారంలో ఈ మార్పులు చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు.. ఇవి రోజూ తింటే ఎంతో లాభం..
మన గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ స్థాయి ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో ఎక్కువ గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
Follow us on

శీతాకాలంలో ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాతావరణంలో వచ్చే మార్పుల ఆధారంగా ఆహారంలో మార్పులు అవసరమంటున్నారు. వాస్తవానికి పోషకాహారం తీసుకోవాలనుకునేవారు ప్రతిరోజు గుడ్లు తినేందుకు ప్రాధాన్యత ఇస్తారు. గుడ్లు చాలా మందికి ఇష్టమైన ఆహారం కూడా. గుడ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి, తింటే ఎంతో ఆరోగ్యం కూడా. అయితే ఈ చలికాలంలో గుడ్లు తినడం మంచిదని చాలా మంది భావిస్తారు. ఉష్ణోగ్రతలు పడిపోయే కొద్దీ, శరీరంలో రక్త ప్రసరణ మందగిస్తుంది. ఎముకలలో నొప్పి మొదలవుతుంది. జుట్టు రాలడం, గోళ్లల్లో సమస్యలు వంటివి ఉత్పన్నమవుతాయి. రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆహారంలో చేసుకొనే చిన్నచిన్న మార్పులు అనేక దీర్ఘకాలిక సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. చల్లటి వాతావరణంలో గుడ్లు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. గుడ్లలో మీ ఆరోగ్యానికి మేలు చేసే అనేక విటమిన్లు ఉన్నాయి. అయితే మరీ ఎక్కువ కాకుండా, ఈ సీజన్ లో రోజూ 2 గుడ్లు తినడం ద్వారా ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జలుబు, దగ్గు నివారణకు

శీతాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అందువల్ల ప్రజలు సులభంగా దగ్గు, జలుబులను కలిగించే ఫ్లూ బారిన పడతారు. ఇలాంటప్పుడు గుడ్డులోని ప్రొటీన్ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు, శరీర బలాన్ని పెంచుతుంది. ఇది కాకుండా, ఇందులో విటమిన్లు B6 , B12 ఉన్నాయి, ఈ పోషకాలు ఫ్లూని నివారించడంలో సహాయపడతాయి.

ఎముకల ఆరోగ్యానికి గుడ్లు

గుడ్డు తినడం ద్వారా శరీరానికి కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలకు చాలా రకాలుగా మేలు చేస్తుంది. గుడ్లలో విటమిన్ డి, జింక్ ఆస్టియోజెనిక్ బయోయాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి లుటిన్, జియాక్సంతిన్ వంటి మూలకాలను పెంచి, ఎముకలను లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ రకంగా చలికాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులను నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి

విటమిన్ డి లోపం తలెత్తకుండా

శీతాకాలంలో ఎండ తక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో శరీరంలో విటమిన్ డి లోపం తలెత్తవచ్చు. మనకు రోజుకి 10 Mcg డి విటమిన్ అవసరం. ఒక గుడ్డులో 8.2 Mcg విటమిన్ డి ఉంటుంది. రోజూ రెండు గుడ్లు తినడం ద్వారా, మీకు కావాల్సిన మోతాదులో విటమిన్ డి పొందవచ్చు. ఎండలో తిరగని వారికి ప్రతిరోజూ గుడ్లు తినడం ద్వారా విటమిన్‌ డి పొందవచ్చు.

విటమిన్ B12

ప్రతిరోజూ శరీరానికి అవసరమయ్యే విటమిన్ B12 మోతాదులో, సుమారు 50 శాతం రెండు గుడ్లు తింటే లభిస్తుంది. ఉడికించిన ఒక కోడి గుడ్డులో 0.6 మైక్రోగ్రాముల విటమిన్ బి12 ఉంటుంది. విటమిన్ బి12 లోపం రాకుండా ఉండాలంటే రెండు గుడ్లను పచ్చసొనతో పాటుగా మొత్తం తినాడం మంచిది. విటమిన్ B12 చాలా వరకు పచ్చసొన నుండి లభిస్తుంది.

జుట్టు రాలడాన్ని నివారించవచ్చు

శీతాకాలంలో జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. గుడ్లు తినడం ద్వారా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. కోడిగుడ్లలో విటమిన్ B12, B5, బయోటిన్, రిబోఫ్లావిన్, థయమిన్ లాంటి B కాంప్లెక్స్ D, E విటమిన్లతో పాటు సెలీనియం, ఐరన్, ఫోలేట్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎంజైమ్‌లు ఉత్పత్తిని పెంచి జుట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..