కర్నూలు జిల్లాలో టమోటా ధరలు కిలో ఐదు రూపాయలకు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. రవాణా ఖర్చులు కూడా రాక, పెట్టిన పెట్టుబడి పోయి అప్పుల పాలవుతున్నారు. కూలీ ఖర్చులకు కూడా గిట్టుబాటు కాకపోవడంతో టమోటా పొలాలను వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.