Dreams: మీకు తరచూ ఇలాంటి కలలు వస్తున్నాయా? అయితే మీలో ఈ సమస్య ఉన్నట్లే!

|

Aug 07, 2022 | 9:07 PM

కలలు అనేవి ప్రతీ ఒక్కరికీ ఒకేలా ఉండవు. వారి మానసిక స్థితి, పడుతోన్న ఒత్తిడి, ఎమోషన్స్ ఆధారంగా కలలు అనేవి వస్తుంటాయి.

Dreams: మీకు తరచూ ఇలాంటి కలలు వస్తున్నాయా? అయితే మీలో ఈ సమస్య ఉన్నట్లే!
Dreams
Follow us on

కలలు అనేవి ప్రతీ ఒక్కరికీ ఒకేలా ఉండవు. వారి మానసిక స్థితి, పడుతోన్న ఒత్తిడి, ఎమోషన్స్ ఆధారంగా కలలు అనేవి వస్తుంటాయి. కొంతమంది మంచి కలలు రావచ్చు. మరికొందరికి పీడకలలు రావచ్చు. ఎవరికి ఏయే కలలు రావాలన్నది మనం చెప్పలేం. ఇదంతా ఒక ఎత్తయితే.. యాంగ్జయిటీకి గురవుతున్న వ్యక్తులకు భిన్నమైన కలలు వస్తాయని యూనివర్సిటీ ఆఫ్ డ్యూసెల్టార్ఫ్‌కు చెందిన వైద్యులు అంటున్నారు. వాటి బట్టి వారి మానసిక స్థితిని అంచనా వేయొచ్చునని చెబుతున్నారు.

మాజీ ప్రేమికులకు సంబంధించి, ప్రమాదాలు జరిగినట్లు, భయపడుతున్నట్లు, విమానం కూలిపోతున్నట్లు, తమపై దాడి జరుగుతున్నట్లు, ఎవరైనా తరుముతున్నట్లుగా కలలు వస్తున్నట్లయితే.. తప్పకుండా ఆయా వ్యక్తులు యాంగ్జయిటీకి గురవుతున్నట్లుగా అంచనా వేయొచ్చు. ఊపిరి సరిగ్గా ఆడకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, చిరాకు, నోరు పొడిబారడం విపరీతమైన తలనొప్పి లాంటివి యాంగ్జయిటీ లక్షణాలు.. ఇవి తీవ్రతరమైతే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ ఆర్టికల్ కేవలం హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారం బట్టి ప్రచురించబడింది. దీంతో టీవీ9 వెబ్‌సైట్, టీవీ9కు ఎలాంటి సంబంధం లేదు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..