Health Tips: అధికంగా దాహం వేస్తోందా.. ఆ సమస్య కావొచ్చు.. వెంటనే జాగ్రత్త పడండి..

|

Jan 08, 2023 | 8:00 AM

ఓ వ్యక్తి జీవితంలో నీటి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీరు అనేది లేకపోతే మనిషి జీవించడమే కష్టం. ఆహారం లేకపోయినా.. నీళ్లు తాగి తమ కడుపును నింపుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది ఆహారం కాకపోయినా..  ఓ విధంగా చెప్పాలంటే తాగునీరు లేకుండా..

Health Tips: అధికంగా దాహం వేస్తోందా.. ఆ సమస్య కావొచ్చు.. వెంటనే జాగ్రత్త పడండి..
Drinking Water
Follow us on

ఓ వ్యక్తి జీవితంలో నీటి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీరు అనేది లేకపోతే మనిషి జీవించడమే కష్టం. ఆహారం లేకపోయినా.. నీళ్లు తాగి తమ కడుపును నింపుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది ఆహారం కాకపోయినా..  ఓ విధంగా చెప్పాలంటే తాగునీరు లేకుండా మనిషి బ్రతకలేడు. అంతేకాదు ప్రతి రోజూ నిర్ణీత మొత్తంలో నీరు తాగాలి. లేకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందంటున్నారు. సాధారణంగా మనం నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ఒక రోజులో 7 నుంచి 8 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలంటే నీటి అవసరం ఎంతో ఉంది. నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. నీరు అనేక ఇతర వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. నీరు మన జీవితాన్ని సమతుల్యం చేస్తుంది కానీ దాని పరిమాణంలో తేడా వస్తే అది జీవితానికి సంక్షోభాన్ని సృష్టిస్తుంది. దాహం అనే భావన ద్వారా శరీరం నీటి ఆవశ్యకతను తెలియజేస్తూ ఉంటుంది. అయితే ప్రజలు అవసరానికి మించి నీటిని తీసుకోవడం చాలా సార్లు కనిపిస్తుంది. చాలా సార్లు దాహం లేకుండా వారు నీరు తాగుతూ ఉంటారు. అయితే అలా చేయడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం. ఈ నాలుగు సమస్యల గురించి తెలుసుకుందాం.

మధుమేహం

ప్రస్తుతం మధుమేహ వ్యాధి అన్ని వయసుల వారిలోనూ వేగంగా విస్తరిస్తోంది. దీనికి కారణం చెడు జీవనశైలి. రక్తంలో చక్కెరశాతం పెరగడం వల్ల తరచుగా దాహం వేస్తుంది. శరీరంలో సరిపడ నీరు లేకపోతే మూత్రపిండాలు పనిచేయలేవు.

ఇవి కూడా చదవండి

అజీర్ణం

చాలా సార్లు స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు తేలికగా జీర్ణం కాదు. సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు కావాలి. దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది అధిక దాహానికి కారణం అవుతుంది.

విపరీతంగా చెమటలు

మీ శరీరం ఎక్కువగా చెమట పట్టడం ప్రారంభిస్తే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి ఎక్కువ నీటిని కోరుతుంది. దీని కారణంగా మనకు మరింత దాహం అనిపిస్తుంది.

ఆందోళన

ఆందోళన కారణంగా నోరు ఎండిపోతుంది. దీనివల్ల ఒక వ్యక్తి ఎక్కువగా నీరు తాగుతారు. అటువంటి పరిస్థితిలో కొన్ని ఎంజైమ్‌లు నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలం మొత్తాన్ని కూడా తగ్గిస్తాయి. అప్పుడు అధికంగా దాహం వేస్తోంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..