మీరు ఎక్కువగా జంక్ పుడ్ తింటున్నారా.. అయితే మీకు సంతాన భాగ్యం అంతంత మాత్రమే.. ఎందుకో తెలుసా..

|

Feb 24, 2021 | 5:01 AM

Junk Food Effects: ప్రస్తుత బిజీ లైఫ్లో చాలా మంది జంక్ ఫుడ్ ను తినడానికే ఇష్ట పడుతున్నారు. అయితే ఇలా జంక్ ఫుడ్ కు

మీరు ఎక్కువగా జంక్ పుడ్ తింటున్నారా.. అయితే మీకు సంతాన భాగ్యం అంతంత మాత్రమే.. ఎందుకో తెలుసా..
Follow us on

Junk Food Effects: ప్రస్తుత బిజీ లైఫ్లో చాలా మంది జంక్ ఫుడ్ ను తినడానికే ఇష్ట పడుతున్నారు. అయితే ఇలా జంక్ ఫుడ్ కు భానిసయ్యేవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. సాయంత్రం అయ్యిందంటే చాలు ప్రతి ఒక్కరు సరదాగా బయటకు వెళ్లి ఏదో ఒకటి రుచిగా తినాలనుకుంటారు, కాని ఇప్పుడు అలా బయటకు వెళ్లి తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు న్యూట్రిషనిస్టులు.

జంక్ ఫుడ్ అతిగా తినేవారిపై ఓ సంస్థ అధ్యయనం జరిపింది. అడిలైడ్‌లోని రాబిన్‌సన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు మహిళలపై జంక్ ఫుడ్ ప్రభావాలపై అధ్యయనం జరిపారు. మహిళలు ఫాస్ట్‌ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని, లేకపోతే భవిష్యత్తులో సంతాన సమస్యలు తప్పవని పేర్కొంది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, ఐర్లాండ్ దేశాల్లో సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న సుమారు 5 వేల మందికి పైగా మహిళలపై పరిశోధన నిర్వహించారు.

పిజ్జా, బర్గర్లు, ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఆలూ చిప్స్, డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, చాట్ లాంటివి సంతాన సామర్థ్యం తగ్గిస్తాయని అధ్యయనం వెల్లడించింది. మద్యపానం, ధూమపానం, వయసు, శరీరతత్వం వంటివి కూడా సంతాన సామర్థ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్నట్లు స్పష్టం చేశారు. ఫాస్ట్ ఫుడ్ తక్కువగా తింటూ, పండ్లు ఎక్కువగా తినే మహిళల్లో సంతాన సామర్థ్యం ఎక్కువగా ఉండి, తక్కువ సమయంలోనే గర్భం దాల్చుతున్నారని తేల్చారు.

Central Electoral Commission: బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలపై కసరత్తు..