దాదాపు అందరు ఉదయం లేవగానే టీ(TEa) తాగా అవాటు ఉంటుంది. కొందరైతే రోజులో ఒకటి నుంచి ఐదుసార్లు టీ తాగుతారు. అయితే ఈ టీ తాగడం శరీరానికి మంచిదేనా అంటే.. కాదని చెబుతున్నారు నిపుణులు. రుచితో పాటు, మనకు రోజూ అవసరమైన ఆహారం(Food) నుండి అటువంటి పోషకాలు లభిస్తాయి. కానీ కొన్ని ఆహార పదార్థాలు విటమిన్లు, ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి. అందులో ఒకటి చాయ్..
టీలో ఉండే టానిన్లు ముదురు గోధుమ రంగును అందిస్తాయి. అదేవిధంగా, గ్రీన్ టీలో క్యాటెచిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. టానిన్ అధిక సాంద్రతలో ప్రోటీన్, ఐరన్ శోషణను నిరోధించగలదు. అటువంటి పరిస్థితిలో ప్రోటీన్ అధికంగా ఉండే వాటిని తిన్న తర్వాత తాగకూడదు.
పచ్చి కూరగాయలు తిన్న తర్వాత
ఆకుకూరల్లో ఉండే గోయిట్రోజెన్‌లు నిజానికి థైరాయిడ్ గ్రంధి ద్వారా అయోడిన్ శోషణను నిరోధించి అయోడిన్ లోపానికి కారణమవుతాయి. పచ్చి కూరగాయలు తిన్న తర్వాత టీ తాగడం మానేయాలి.
శుద్ధి చేయని తృణధాన్యాలు, మిల్లెట్లలో ఫైటేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది విత్తనాల అంకురోత్పత్తి సమయంలో భాస్వరం మూలంగా పనిచేస్తుంది. కానీ ఇది ఇనుము, జింక్, కాల్షియం, మెగ్నీషియంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు టీ తాగిన తర్వాత నానబెట్టిన మొలకలను తినకూడదు.
Read Also.. Bitter Gourd: మీరు కాకరకాయ తినడం లేదా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..