పండ్లు మనకు ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా వస్తోంది. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర తృణ ధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలసిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యులు సూచిస్తారు అయితే ఈ పండ్లను ఏ సమయంలో తినాలి..? వేటితో కలిపి తినాలి అనేది చాలా ముఖ్యం. పండ్లను పాలతో కలిపి షేక్స్ తయారు చేస్తారు. పండ్ల సీతాఫలాన్ని పెరుగుతో తయారు చేస్తారు. పాలు, పెరుగుతో పండ్లను కలపడం చాలా సాధారణమైన పద్ధతి. అయితే పాలు,పెరుగును పండ్లతో తీసుకోవడం వల్ల తక్కువ ప్రయోజనం. ఆరోగ్యానికి ఎక్కువ హానికరం అని మీకు తెలుసా.. పాలు, పెరుగుతో పాటు పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా హానికరం అని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు.
పాలలో నిమ్మరసం తీసుకుంటే ఏం జరుగుతుంది..? పండ్లలో సిట్రిక్ యాసిడ్, మాలిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, ఫ్యూమరిక్ యాసిడ్ వంటి ఎంజైమ్‌లు, ఆమ్లాలు ఉంటాయని నిపుణులు వివరించారు. ఈ ఎంజైమ్‌లు, ఆమ్లాలన్నీ పాల ఉత్పత్తులలో కనిపించే లాక్టిక్ యాసిడ్‌తో బాగా కలపవు. పాలు, పెరుగు, జున్నుతో పాటు కొన్ని పండ్లను తీసుకోవడం వల్ల గట్ లైనింగ్ దెబ్బతింటుంది. ఈ ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల మీ శరీరంలో జీర్ణం కాని జీవక్రియ వ్యర్థాలు పేరుకుపోతాయి. ఈ ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల చర్మం దెబ్బతింటుంది. ఈ ఆహారాలను కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యం విషంలాగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలా తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఆహారాలను కలిపి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ఆహారాలు జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి, చర్మ రుగ్మతలను తీవ్రతరం చేస్తాయి. పేగు సమస్యలను కలిగిస్తాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం