Six Pack: తెగ తిని.. వ్యాయామం చేస్తే సిక్స్ ప్యాక్ వచ్చేయదు.. అందుకు అవి కూడా సపోర్ట్ చేయాలి!

|

Oct 18, 2021 | 6:07 PM

ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ కల్సి ఒకే జిమ్ కి వెళుతున్నారు. ఒకేరకమైన డైట్ తీసుకుంటున్నారు. ఒకే విధమైన వ్యాయామాలు చేస్తున్నారు. కానీ, ఇద్దరిలో ఒకరికి మాత్రమే సిక్స్ ప్యాక్ ఫిట్ నెస్ వచ్చింది. మరొకరికి మాత్రం అసలు కండరాల పెరుగుదల పెద్దగా కనిపించలేదు.

Six Pack: తెగ తిని.. వ్యాయామం చేస్తే సిక్స్ ప్యాక్ వచ్చేయదు.. అందుకు అవి కూడా సపోర్ట్ చేయాలి!
Six Pack
Follow us on

Six Pack:  ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ కల్సి ఒకే జిమ్ కి వెళుతున్నారు. ఒకేరకమైన డైట్ తీసుకుంటున్నారు. ఒకే విధమైన వ్యాయామాలు చేస్తున్నారు. కానీ, ఇద్దరిలో ఒకరికి మాత్రమే సిక్స్ ప్యాక్ ఫిట్ నెస్ వచ్చింది. మరొకరికి మాత్రం అసలు కండరాల పెరుగుదల పెద్దగా కనిపించలేదు. ఇలా ఎందుకు అవుతుందో ఎవరికీ అర్ధం కాలేదు. నిజమే ఒకే రకంగా వ్యాయామం చేసినా.. ఒకే రకమైన ఆహారం తీసుకున్నా ఏ ఇద్దరికీ కూడా ఒకే రకంగా కండరాల బలం లభించడం కనిపించదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పడు ఈ విషయంలో ఒక క్లారిటీ వారికీ వచ్చింది. ఈ విధమైన తేడాకు కారణం మానవుల జన్యువులు అని వారు నిర్ధారించారు.

బలహీనమైన DNA ఉన్న వ్యక్తులలో, వ్యాయామం చేసినప్పటికీ ఆలస్యంగా ప్రభావం చూపుతుంది. అదే సమయంలో, బలమైన DNA ఉన్న వ్యక్తులలో ప్రభావం త్వరగా కనిపిస్తుంది. కేంబ్రిడ్జ్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్శిటీ పరిశోధకులు ఒక వ్యక్తి జన్యువులు అతని ఎక్సైజ్ శిక్షణను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి 24 మునుపటి అధ్యయనాలను పరిశీలించారు. మానవులలో వ్యాయామానికి సంబంధించిన 13 జన్యువులు ఉన్నాయని విశ్లేషణ వెల్లడించింది. శరీరంపై వ్యాయామం మెరుగైన ప్రభావాన్ని చూపించడానికి ఈ 13 జన్యువులు , బలంగా ఉండడం అవసరం.

ఈ జన్యువులు కార్డియో ఫిట్‌నెస్, కండరాల శక్తి శిక్షణ, వాయురహిత వ్యాయామాలను ప్రభావితం చేస్తాయి. ఈ 13 జన్యువులు మానవ శరీరంలో వ్యాయామం మెరుగైన ప్రభావాన్ని చూపించడానికి బాధ్యత వహిస్తాయి. వీటికి బాధ్యత వహిస్తున్న కారణాలలో 72 శాతం జన్యువులేనని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాయామం తర్వాత 72 శాతం వరకు జన్యువులు ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. ఏదేమైనా, మానవ ఆహారం, పోషకాలు కూడా కొంత పాత్ర పోషించినా.. కండరాల పెరుగుదలలో జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలా అని పూర్తిగా జన్యువులే ఆ పని చేస్తాయని అనుకోనక్కర్లేదు. దానికి ఆహరం పోషకాలు కూడా సహకరిస్తేనే కండరాల పెరుగుదల సాధ్యం అవుతుంది.

15 నుండి 55 సంవత్సరాల వయస్సు గల 3,012 మంది వయోజనులపై చేసిన పరిశోధన ప్రకారం, మానవ జన్యువులు కార్డియో ఫిట్‌నెస్, కండరాల బలం, వాయురహిత వ్యాయామాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రతి వ్యక్తి జన్యు నమూనా భిన్నంగా ఉంటుందని వివిధ పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల, ఒకే వ్యాయామం చేయడం వల్ల వివిధ వ్యక్తులలో విభిన్న ప్రభావాలు ఉంటాయి. అలాంటి సందర్భాలలో, వ్యక్తి జన్యువులను అర్థం చేసుకోవడం ద్వారా, వ్యాయామ దినచర్యను తదనుగుణంగా మార్చవచ్చు. ఇది ఆయా వ్యక్తులకు మెరుగైన ఫలితాలను ఇస్తుంది.

ఇవి కూడా చదవండి: TATA Punch: భద్రతా ప్రమాణాలలో టాటా మోటార్స్ కార్లు టాప్.. 5 స్టార్ రేటింగ్ తో వస్తున్న టాటా పంచ్!

Pre Install Apps: మీకు తెలుసా? స్మార్ట్‌ఫోన్‌లలో ప్రీ ఇన్‌స్టాల్ యాప్‌లతో మన డాటా చోరీ అయిపోతోంది!

Dera Baba Case: రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదాకు చెందిన గుర్మీత్ రామ్ రహీమ్ సహా నలుగురికి జీవిత ఖైదు!