Cashew Side Effects: జీడిపప్పు ఎక్కువగా తినే అలవాటుందా..? వామ్మో, పెను ప్రమాదంలో పడుతున్నట్లే..

Cashew Side Effects: జీడిపప్పులో ఎన్నో పోషకాలు దాగున్నాయి. దీనిని పలు ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. జీడిపప్పు తింటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. అదే సమయంలో దీన్ని తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యవంతంగా మారుతుంది.

Cashew Side Effects: జీడిపప్పు ఎక్కువగా తినే అలవాటుందా..? వామ్మో, పెను ప్రమాదంలో పడుతున్నట్లే..
Cashew

Updated on: May 18, 2023 | 1:55 PM

Cashew Side Effects: జీడిపప్పులో ఎన్నో పోషకాలు దాగున్నాయి. దీనిని పలు ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు. జీడిపప్పు తింటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. అదే సమయంలో దీన్ని తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యవంతంగా మారుతుంది. అయితే జీడిపప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీడిపప్పులో అధిక మొత్తంలో పోషకాలు ఉన్నందున, జీడిపప్పును అధికంగా తినకుండా ఉండాలంటున్నారు. జీడిపప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జీడిపప్పు తినడం వల్ల కలిగే నష్టాలు..

ఊబకాయం పెరుగుతుంది: జీడిపప్పులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే మధుమేహం, థైరాయిడ్ రోగులు జీడిపప్పు తినకూడదు. మీరు ఇప్పటికే ఊబకాయంతో ఉన్నట్లయితే, మీరు జీడిపప్పు తినకుండా ఉండాలి.

కిడ్నీ స్టోన్: జీడిపప్పులో మంచి మొత్తంలో మెగ్నీషియం, కాల్షియం ఉంటాయి. అందువల్ల జీడిపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీకు ఇప్పటికే మూత్రపిండాల సమస్యలు ఉన్నట్లయితే, మీరు జీడిపప్పును తినకుండా ఉండాలి. ఎందుకంటే జీడిపప్పు తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

డీహైడ్రేషన్ సంభవించవచ్చు: జీడిపప్పులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. మీరు ఎక్కువ ఫైబర్ తిన్న తర్వాత తక్కువ నీరు తాగితే డీహైడ్రేషన్ సంభవించవచ్చు. ఎందుకంటే ఫైబర్ సరిగ్గా కరిగిపోవడానికి నీరు అవసరం. శరీరంలో పీచుపదార్థం ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలోని నీటిని పీల్చుకుంటుంది. దీని వల్ల మలబద్ధకం వంటి సమస్యలు కూడా మొదలవుతాయి.

ఊపిరితిత్తుల సమస్య: జీడిపప్పులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇనుము అధిక వినియోగం కణాల పనిని ప్రభావితం చేస్తుంది. కణాలలో ఇనుము నిక్షిప్తమవుతుంది. ఇది ఊపిరితిత్తుల కణాలలో పేరుకుపోయినట్లయితే.. ఆస్తమా లక్షణాలు కనబడతాయి. దీంతో మనిషికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం