
50 ఏళ్లకు పైబడిన మహిళలు తప్పక తీసుకోవలసిన 3 సహజమైన ఆహారాలు శరీరంలో కాల్షియం లోపాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. వీటిని ఆహారంలో చేర్చడం ద్వారా కాల్షియం సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
శరీరంలో కాల్షియం ఎముకలు, పళ్లకు అవసరం. దీనివల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శరీరంలో 99 శాతం కాల్షియం ఎముకలు, పళ్ళలో నిల్వ అవుతుంది. మిగిలిన 1 శాతం రక్తం, నరాలలో ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది.
రోజుకు 1000 మిల్లిగ్రాములు కాల్షియం అవసరం అని పెద్దవారికి సూచిస్తారు. కొందరికి మరింత ఎక్కువ అవసరమవుతుంది. ముఖ్యంగా వయసు పెరుగుతున్నప్పుడు.
వయసు పెరిగినప్పుడు, తైరోయిడ్, జుట్టు ఊడటం, మోకాళ్ళ నొప్పి, హార్మోన్ సమస్యల వల్ల కాల్షియం లోపం తలెత్తుతుంది. అలాగే విటమిన్ D లేకపోవడం కూడా కారణం అవుతుంది.
విటమిన్ D శరీరంలో కాల్షియం బాగా శోషణం అవ్వడానికి సహాయం చేస్తుంది. విటమిన్ D లేకపోతే కాల్షియం సమర్ధవంతంగా పనిచేయదు. ప్రతి రోజూ 20 నిమిషాలు సూర్యరశ్మిలో కూర్చోవడం వల్ల విటమిన్ D పొందవచ్చు.
ఉసిరికాయలో విటమిన్ C, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. శరీరంలో కాల్షియం శోషణను మెరుగుపరుస్తుంది.
మునగాకులో కాల్షియం, ఐరన్, విటమిన్ A, C, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. మునగాకాయల్లో శరీర వికాసానికి అవసరమైన ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అందులో కాల్షియం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఆరోగ్యానికి మంచిదిగా ఉండటానికి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 1 టీ స్పూన్ మునగాకు పొడిని తీసుకోండి.
ఒక టీ స్పూన్ నువ్వులను తీసుకుని వేయించండి. తర్వాత వాటిని ఒక టీ స్పూన్ బెల్లం, కొద్దిగా నెయ్యితో కలిపి లడ్డూ తయారు చేసుకోండి. ఈ ఆరోగ్యకరమైన లడ్డూని క్రమంగా తింటే శరీరంలో కాల్షియం స్థాయులు మెరుగుపడతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)